KTR's Achhe Din Tweet: టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మీరేమి చేశారంటూ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇరుపార్టీల మధ్య వార్‌ జరుగుతోంది. తాజాగా ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. దీనికి ప్రధాని మోదీ సైతం కౌంటర్ ఇచ్చారు. దీనిపై నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు సోషల్‌ మీడియా హాట్ టాపిక్‌గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రియమైన మోదీ జీ ..8 ఏళ్ల క్రితం ఇదే రోజు అచ్ఛే దిన్ అని వాగ్ధానం చేశారని అంటూనే దేశ పరిస్థితులను వివరిస్తూ ట్వీట్ చేశారు. బీజేపీ పాలనలో రూపాయ మారక విలువ పూర్తిగా తగ్గిపోయిందని..45 ఏళ్లల్లో అత్యధిక నిరుద్యోగం నమోదైదన్నారు. ద్రవ్యోల్బణం సైతం 30 ఏళ్ల నాటి పరిస్థితిని గుర్తు చేస్తోందని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక ఎల్పీజీ ధర మనదేశంలోనే ఉందన్నారు. 42 ఏళ్లల్లో ఇదే అత్యంత చెత్త ఆర్థిక వ్యవస్థ అంటూ ట్వీట్ చేశారు.  


దీనికి ప్రధాని మోదీ స్పందించారు. భారత్‌ గెలిచిందని స్పష్టం చేశారు. భారతదేశం మంచి విజయం సాధించిందని..మంచి రోజలు త్వరలో వస్తాయని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ, మంత్రి కేటీఆర్ ట్వీట్లపై నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. గతకొంతకాలంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో పెద్ద రచ్చే జరిగింది. ఇరుపార్టీలు మాటల యుద్ధానికి దిగాయి.  


చివరకు సీఎం కేసీఆర్ ధాన్యాన్ని తామే కొంటామని చెప్పడంతో వివాదం సర్దుమణిగింది. ఇటీవల తెలంగాణలో పర్యటించిన బీజేపీ పెద్దలు..టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వమే టార్గెట్‌ విమర్శలు గుప్పించారు. కేంద్రమంత్రి అమిత్ షా(AMITH SHAH), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడత వారిగా రాష్ట్రంలో పర్యటించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. బీజేపీ అగ్ర నేతల టూర్‌పై టీఆర్‌ఎస్ నేతలు సైతం ఘాటుగా స్పందించారు. మొత్తంగా మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది.


Also read:Green Card: గ్రీన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్..కీలక ప్రతిపాదనలకు పచ్చజెండా..!


Also read:Net Banking Tips: పొరపాటున మరొకరి ఖాతాకు మనీ ట్రాన్స్‌ఫర్ చేశారా... ఇలా చేస్తే మీ డబ్బును తిరిగి పొందవచ్చు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook