New Sim Card Rules: మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులుంటే 50 వేల నుంచి 2 లక్షలు ఫైన్, ఇలా చెక్ చేసుకోండి
New Sim Card Rules: సిమ్ కార్డు విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే దేశంలో కొత్త టెలీకం చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం సిమ్ కార్డు నిబంధనలు కఠినంగా మారాయి. ఎవరు ఎన్ని సిమ్ కార్డులు కలిగి ఉండవచ్చో స్పష్టత వచ్చింది. ఆ వివరాలు మీ కోసం.
New Sim Card Rules: సిమ్ కార్డుల విషయంలో ప్రస్తుత పరిస్థితి గతంలో ఉన్నట్టు లేదని గమనించాలి. అనుమతించిన పరిమితిని దాటి సిమ్ కార్డులు కలిగి ఉండకూడదు. లేకపోతే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అసలు చాలామందికి తమ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు పనిచేస్తున్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో చాలా సులభంగా క్షణాల్లో తెలుసుకునే వీలుంది. అదెలాగో చూద్దాం.
సిమ్ కార్డుల దుర్వినియోగం పెరిగిపోతోంది. అసాంఘిక కార్యకలాపాలకు, మోసాలకు వినియోగిస్తున్నారు. మనకు తెలియకుండా మనం ఎక్కడ పడితే అక్కడ ఇచ్చే ఆధార్ జిరాక్స్ కాపీల ద్వారా ఈ పరిస్థితి ఎదురౌతోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డుల విషయంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రాంతాన్ని బట్టి సిమ్ కార్డులు ఎవరెన్ని కలిగి ఉండాలనే పరిమితులున్నాయి. ఈశాన్యం, జమ్ము కాశ్మీర్, అస్సోం వంటి ప్రాంతాల్లో ఒక వ్యక్ది గరిష్టంగా 6 సిమ్ కార్డులు మాత్రమే కలిగి ఉండవచ్చు. అదే ఇతర ప్రాంతాల్లో అయితే గరిష్టంగా ఒక వ్యక్తి 9 సిమ్ కార్డులు పొందవచ్చు.
పరిమితి దాటితే ఫైన్ ఎంతో తెలుసా
ఇది తాజాగా కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితి. ఈ పరిమితి దాటితే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అది కూడా భారీగానే. పరిమితికి మించి సిమ్ కార్డులు కలిగి ఉంటే 50 వేల రూపాయలు జరిమానా ఉంటుంది. రెండోసారి ఇలా జరిగినతే 2 లక్షల రూపాయలు ఫైన్ చెల్లించాలి. మోసపూరిత విధానాలతో సిమ్ కార్డులు పొందినట్టు రుజువైతే మూడేళ్ల జైలు శిక్షతో పాటు 50 లక్షల వరకూ ఫైన్ ఉంటుంది.
పరిమితి దాటిన సిమ్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తులు రీ వెరిఫికేషన్ చేయించుకోవల్సిందిగా టెలీకం శాఖ కోరుతోంది. పరిమితి దాటి సిమ్ కార్డులు కలిగి ఉంటే ఆయా వ్యక్తుల కార్డుల్ని నిలిపి వేయడం లేదా సరెండర్ చేయడం, బదిలీ చేయడం వంటి ఆప్షన్లు ఉన్నాయి. చాలామందికి తమ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు పనిచేస్తున్నాయో తెలియని పరిస్థితి ఉంటుంది. అందుకే టెలీకం మంత్రిత్వ శాఖ ఓ పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ద్వారా క్షణాల్లో తమ పేరుతో ఏయే సిమ్ కార్డులు పని చేస్తున్నాయో తెలుసుకోవచ్చు.
మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు
ముందుగా https://sancharsaathi.gov.in/ ఓపెన్ చేయాలి. అందులో మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ క్లిక్ చేసి మీరు ప్రస్తుతం వినియోగిస్తున్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా నమోదు చేయాలి. అప్పుడు ఓటీపీతో ధృవీకరించగానే స్క్కీన్ పై మీ పేరుతో అంటే మీ ఆధార్ కార్డుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయో ప్రత్యక్షమౌతుంది. అందులో మీకు తెలియకుండా ఏమైనా నెంబర్లు కన్పిస్తే యాక్షన్ రిక్వైర్డ్, స్టాప్ వంటి ఆప్షన్లు కన్పిస్తాయి. ఈ ఆప్షన్ల సహాయంతో మీకు తెలియకుండా మీ పేరుతో ఏమైనా ఫోన్ నెంబర్లు ఉన్నట్టు కన్పిస్తే తగిన చర్యలు తీసుకోవచ్చు.
Also read: Cheapest Cashew Market: అక్కడ జీడి పప్పు టొమాటో కంటే తక్కువ ధరకే లభిస్తుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook