Cheapest Cashew Market: అక్కడ జీడి పప్పు టొమాటో కంటే తక్కువ ధరకే లభిస్తుంది

మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు డ్రై ఫ్రూట్స్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇందులో జీడిపప్పు అత్యంత కీలకమైంది. కారణం ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ ధరే చాలా ఎక్కువ. కిలో జీడిపప్పు కొన్ని ప్రాంతాల్లో 1000 రూపాయలు కూడా పలుకుతోంది. కొన్ని మన దేశంలోనే ఓ ప్రాంతంలో కిలో జీడి పప్పు టొమాటో ధర కంటే తక్కువే అంటే నమ్ముతారా..

Cheapest Cashew Market: మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు డ్రై ఫ్రూట్స్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇందులో జీడిపప్పు అత్యంత కీలకమైంది. కారణం ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ ధరే చాలా ఎక్కువ. కిలో జీడిపప్పు కొన్ని ప్రాంతాల్లో 1000 రూపాయలు కూడా పలుకుతోంది. కొన్ని మన దేశంలోనే ఓ ప్రాంతంలో కిలో జీడి పప్పు టొమాటో ధర కంటే తక్కువే అంటే నమ్ముతారా..

1 /7

కానీ జీడి పప్పుని అందరూ అఫోర్డ్ చేయలేని పరిస్థితి. కారణం కిలో జీడి పప్పు 800-1000 మధ్యలో ఉంటోంది. దాంతో అందరూ కొనలేని పరిస్థితి. అయితే ఓ ప్రాంతంలో మాత్రం జీడిపప్పు మీరు ఊహించనంత చౌకగా లభిస్తుంది

2 /7

జామ్ తడా జిల్లాలోని ఓ గ్రామం నాలా. ఈ గ్రామంలో దాదాపుగా 50 ఎకరాల్లో జీడిపప్పు పండిస్తారు. ఈ గ్రామం చుట్టుపక్కల ఎలాంటి ప్రోసెసింగ్ యూనిట్లు లేకపోవడంతో జీడిపప్పుని పచ్చిగానే వెంటనే అమ్మాల్సి వస్తుంది. దాంతో అత్యంత చౌక ధరకే అమ్మాల్సి వస్తుంటుంది

3 /7

ఇండియాలో అత్యంత చౌకగా జీడి పప్పు లభించేది జార్ఖండ్ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలోని జామ్ తడా  జిల్లాను జీడిపప్పు నగరమని కూడా పిలుస్తారు. ఇక్కడ జీడి పప్పు తోటలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. దాంతో ప్రతి ఏటా వేలాది టన్నుల జీడిపప్పు పండిస్తారు. డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉండటంతో చాలా తక్కువ ధరకే లభిస్తాయి.

4 /7

జీడి పప్పు అత్యంత చౌకగా లభించేది మరెక్కడో కాదు మన దేశంలోనే. కిలో టొమాటో కంటే తక్కువ ధరకు లభిస్తాయి. ప్రస్తుతం టొమాటో కిలో 80 రూపాయలనుంచి 100 రూపాయలు పలుకుతోంది. అంతకంటే తక్కువ ధరకే జీడి పప్పు కొనవచ్చంటే నమ్మలేకున్నారా

5 /7

చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా కంటి చూపు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ఈ సమస్యల్నించి అధిగమించేందుకు జీడిపప్పు, బాదం తినమని వైద్యులు సూచిస్తుంటారు. ఇందులో పోషకాలు  కంటి చూపును పెంచుతాయి.

6 /7

నగరాల్లో రోడ్డువారున కూరగాయలు ఎలా అమ్ముతారో అదే విధంగా జామ్ తడాలో జీడిపప్పు విక్రయిస్తారు. పచ్చి జీడి పప్పు కిలో 45-50 రూపాయలకు లభిస్తుంది. ఇక ప్రోసెస్డ్ అయితే కిలో 150-200 రూపాలుంటుంది.

7 /7

జామ్ తడాతో పాటు సంథాల్ పరగణా, దుమ్కాలో కూడా జీడిపప్పు తోటలు పెద్దఎత్తున విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా జీడిపప్పు అత్యంత చౌక ధరకే లభిస్తుంది.