Telecom Rules: రోజు రోజుకు పెరుగుతోన్న సైబర్ మోసాల నుంచి సామాన్యులను కాపాడానికి కేంద్ర ప్రభుత్వం టెలికాం నిబంధనల్లో పలు మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో తీసుకొచ్చిన నంబంధనలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అమల్లోకి తీసుకురాబోతుంది. ఈ విషయమై డాట్‌కు టెలికాం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గతంలోనే సిఫార్సు చేసింది. ఈ మార్పులు చేర్పులు లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత అమల్లోకి తీసుకురాబోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా నకిలీ సిమ్ కార్డులతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్న తరుణంలో వీటికి అడ్డుకట్ట వేయడానికి కొత్తవైన కఠిన నిబంధనలు తీసుకురాబోతుంది. కొత్త కనెక్షన్‌ను అందించాలంటే తప్పనిసరిగా బయోమెట్రిక్ తప్పనిసరి. ఎంతో సున్నితమైన సమాచారాన్ని సేకరించడంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా టెలికాం కంపెనీలకు స్పష్టమైన మార్గదర్శకాలు డాట్ జారీ చేయబోతుంది.   వీటితో పాటు స్పెక్ట్రమ్‌ కేటాయింపు.. బదలాయింపులు.. శాటిలైట్ కమ్యూనికేషన్‌కు సంబంధించి ఈ నిబంధనలు తీసుకురాబోతున్నారు. శాటిలైట్ కమ్యూనికేషన్‌కు సంబంధించి నిబంధనలు తీసుకురానున్నారు. మన దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సంబంధిత సేవలను స్టార్ట్ చేయాలంటే.. ఆయా కంపెనీలు గవర్నమెంట్ నుంచి స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు.  


ముఖ్యంగా టెలికాం రంగంలో నియమ, నిబంధనలకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఇండియా టెలిగ్రాఫ్ చట్టం, ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫ్ చట్టం, టెలిగ్రాఫ్ వైర్స్ చట్టం ప్లేస్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. మన దేశ పార్లమెంట్‌లో 2023 డిసెంబర్ 20న టెలికమ్యూనికేషన్స్ బిల్లు 2023 (Telecom Act 2023)ని అమోదించిన సంగతి తెలిసిందే కదా.


ఇదీ చదవండి:  ఏపీలో కాబోయే సీఎంపై వెంకన్న సాక్షిగా రేవంత్ హాట్ కామెంట్స్..


ఇదీ చదవండి: తెలంగాణ వాసులకు శుభవార్త.. వచ్చే 5 రోజులు వానలే వానలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook