Poonch Terror Attack: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇండియన్ ఆర్మీకి చెందిన ట్రక్కుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు వీర మరణం పొందారు. టెర్రరిస్టులు జరిపిన దాడిలో ట్రక్కు మంటల్లో చిక్కుకోగా.. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు వీర మరణం పొందినట్టు ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది. ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సైనికుల మృతి తనను తీవ్రంగా కలచి వేసిందన్న రాజ్ నాధ్ సింగ్.. సైనికుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా పూంచ్ ఉగ్రదాడి ఘటనపై ట్విటర్ ద్వారా స్పందించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరుల సేవలు ఎన్నటికి మరువలేనివి అని ట్వీట్ చేసిన మనోజ్ సిన్హా.. అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.



కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పూంచ్ లో ఉగ్రదాడి ఘటనపై ఆవేదన వ్యక్తంచేశారు. పూంచ్ ఘటన ఎంతో బాధించింది అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. పూంచ్ అమర వీరులకు నివాళి అర్పిస్తున్నట్టు తన ట్వీట్ లో పేర్కొన్న రాహుల్ గాంధీ.. అమర వీరుల కుటుంబాలకు తన ప్రగాడ సంతాపాన్ని ప్రకటించారు. 



నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అద్భుల్లా పూంచ్ ఉగ్రదాడి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పూంచ్ ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారన్న దుర్వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్న ఒమర్ అద్భుల్లా.. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ట్వీట్ చేశారు. అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పిన అబ్ధుల్లా.. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు.


ఇది కూడా చదవండి : Coronavirus Latest: ఒక్క రోజులోనే 12 వేలకు పైగా కొత్త కేసులు.. ఎంత మంది చనిపోయారంటే?



ఇది కూడా చదవండి : Vande Bharat Express: జింకను ఢీకొట్టిన వందే భారత్ ఎక్స్​ప్రెస్.. ఆ డీర్ మీద పడి ఓ వ్యక్తి మృతి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK