Punjab Army Camp Firing: పంజాబ్ ఆర్మీ మెస్‌లో కాల్పులు, నలుగురి మృతి, అంతర్గత కలహాలే కారణమా

Punjab Army Camp Firing: పంజాబ్ ఆర్మీ క్యాంపు ప్రాంతంలో కలకలం రేగింది. ఒక్కసారిగా కాల్పుల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. పంజాబ్‌లోని బతిండా మిలిటరీ క్యాంపు ప్రాంగణంలో ఇవాళ ఉదయం కాల్పులు జరిగాయి. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 12, 2023, 12:41 PM IST
Punjab Army Camp Firing: పంజాబ్ ఆర్మీ మెస్‌లో కాల్పులు, నలుగురి మృతి, అంతర్గత కలహాలే కారణమా

Punjab Army Camp Firing: పంజాబ్‌లోని బతిండా మిలిటరీ క్యాంపు కార్యాలయం అది. ఉన్నట్టుంది ఉదయం కాల్పులు ప్రారంభమయ్యాయి. ఏం జరుగుతుందో తెలియలేదు. కూంబింగ్ ఆపరేషన్ జరుగుతుండటంతో ఈ ప్రాంతమంతా ఆంక్షలున్నాయి. ఉదయం 4.35 గంటలకు కాల్పులు జరిగాయని వెస్టర్న్ కమాండ్ తెలిపారు. కాల్పులు జరిగిన వెంటనే స్టేషన్‌లోని క్విక్ రియాక్షన్ బృందాలు రంగంలో దిగాయి. మొత్తం ప్రాంతమంతా స్వాధీనంలో తీసుకుని జల్లెడ పడుతున్నారు. కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఘటనలో నలుగురు మరణించినట్టు సమాచారం.

కాల్పుల్లో నలుగురు మరణించారని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. అసలీ ఘటన ఎందుకు ఎలా జరిగిందనేది కూడా తెలియదు. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు కానీ ఇంకా లోపలకు వెళ్లలేకపోయారు. కాల్పులు ఆఫీసర్స్ మెస్ లోపల జరిగాయని 80 మంది రెజిమెంట్‌లో నలుగురు మరణించారు.

అయితే ఇది టెర్రరిస్ట్ దాడి కాదని పంజాబ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్‌పీఎస్ పర్మర్ వెల్లడించారు. అదే సమయంలో ఈ దాడి బయటి నుంచి జరిగింది కాదని తెలియడంతో కలకలం రేగుతోంది.

ఈ మిలిటరీ క్యాంపు కార్యాలయం జాతీయ రహదారి 7 పై ఉన్నచండీగఢ్-ఫాజిల్కా స్ట్రెచ్‌లో ఉంది. కాల్పులు జరిగిన తరువాత బతిండా మిలటరీ స్టేషన్ గేట్లన్నీ మూసివేశారు. రెండ్రోజుల క్రితం ఇదే క్యాంపులో ఇన్సాన్ రైఫిల్, 28 బుల్లెట్ క్యాట్రిడ్జ్‌లు మిస్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఘటన వెనుక ఆర్మీ సిబ్బంది ప్రమేయముందనే అనుమానాలున్నాయి.

Also read: Corona Vaccine: గుడ్‌న్యూస్.. అన్ని వేరియంట్లకు ఒక్కటే బూస్టర్ డోస్.. కోవిన్ యాప్‌లో అందుబాటులోకి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News