యూపీలో వింత సంఘటన చోటు చేసుకుంది. భార్య చేసిన రోటి మాడిందని కారణంతో చూపుతూ భర్త తలాక్ (విడాకులు) ఇచ్చాడట. ఈ ఘటన మహోబా జిల్లాలోని పహ్రెతా గ్రామంలో చోటు చేసుకుంది. భాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. త్రిపుల్ తలాక్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసినప్పటికీ ఇంకా ఇలాంటి ఘటనలు కొనసాగడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భర్తపై గృహ హింస కేసు నమోదు


వాస్తవానికి  ఏడాది క్రితమే వీరిద్దరికీ వివాహమైంది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తన భర్త తెగ వేధించేవాడని..సిగరెట్లతో కాలుస్తూ తనను తీవ్రంగా హింసించాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. చివరకు రోటీ మాడిందనే కారణం చూపుతూ తనకు తలాక్ ఇచ్చాడని  ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆమె భర్తపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ వార్త సోషల్ మీడియాలో తెర వైరల్ అవుతోంది.