Made in india vaccine: కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రపంచమంతా జరుగుతోంది. కోవిడ్ వ్యాక్సిన్ తయారుచేసిన దేశాల్లో ఇండియా నిలిచింది. అంతేకాదు ఇతర దేశాలకు సరఫరా చేసి ప్రశంసలు అందుకుంటోంది. అందుకే కెనడాలో ఇప్పుడు ధ్యాంక్యూ ఇండియా అండ్ మోదీ బోర్డులు వెలిశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్‌లో అమెరికాకు చెందిన ఫైజర్(Pfizer),మోడెర్నా(Moderna) కంపెనీలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లతో పాటు ఇండియా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్(Covishield), కోవ్యాగ్జిన్(Covaxin)‌లు మాత్రమే ప్రముఖంగా ఉన్నాయి. ఇండియాలో తయారైన కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇప్పటికే ఇతర దేశాలకు సరఫరా అవుతోంది. విశ్వగురు పేరును సార్ధకం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఇండియా..కెనడాకు 5 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లను సరఫరా చేసింది. ఇండియా చూపించిన ఈ ఔదార్యానికి ప్రశంసలు కురుస్తున్నాయి. కెనడా రోడ్లపై ధ్యాంక్యూ ఇండియా, పీఎం నరేంద్ర మోదీ(Thank you india pm narendra modi boards)అంటూ భారీ బోర్డులు వెలిశాయి. ఇండియా-కెనడా మధ్య మైత్రి వర్ధిల్లాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కెనడా వాసులు. కోవిడ్ 19 వ్యాక్సిన్ అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు 


ప్రపంచంలోని వివిధ దేశాలకు వ్యాక్సిన్‌లను సరఫరా చేయడంలో ఇండియా ముందంజలో ఉంది. మిత్రదేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, బిల్‌గేట్స్ వంటి వ్యక్తులు ఇప్పటికే ఇండియాపై ప్రశంసలు కురిపించిన పరిస్థితి. కొద్దిరోజుల క్రితం ఇండియా-స్వీడన్ మద్య జరిగిన వర్చువల్ సదస్సులో మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్‌(Made in india vaccines)లు 50కి పైగా దేశాలకు సరఫరా చేశామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసే ప్రణాళిక సిద్దం చేస్తున్నట్టు చెప్పారు. 


Also read: 5G Network: ఇండియాలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులో వచ్చేనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook