5G Network: ఇండియాలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులో వచ్చేనా

5G Network: భారతదేశంలో మరో మూడు నెలల్లో అయినా 5జీ అందుబాటులో రానుందే అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవసరమైన మౌళిక సదుపాయాలు, ఆప్టికల్ ఫైబర్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ సిద్ధం చేసుకుంటే 5 జీ అందుబాటులో రావచ్చు. లేదా మరింత ఆలస్యం కానుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 11, 2021, 05:38 PM IST
5G Network: ఇండియాలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులో వచ్చేనా

5G Network: భారతదేశంలో మరో మూడు నెలల్లో అయినా 5జీ అందుబాటులో రానుందే అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవసరమైన మౌళిక సదుపాయాలు, ఆప్టికల్ ఫైబర్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ సిద్ధం చేసుకుంటే 5 జీ అందుబాటులో రావచ్చు. లేదా మరింత ఆలస్యం కానుంది.

ఇండియాలో 5జీ నెట్‌వర్క్ (5G Network) అందుబాటులోకి ఎప్పుడొస్తుందనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే 5జీ నెట్‌వర్క్‌కు  కావల్సిన మౌళిక సదుపాయాల కల్పన అడ్డంకిగా మారింది. టెక్నాలజీకి కీలకమైన ఫైబర్ ఆధారిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంకా సిద్ధం కాలేదు. ఈ నేపధ్యంలో 5జీ ప్రారంభించినా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయాల్సి వస్తుందని టెలికం పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 5జీ అందుబాటులో తెచ్చేందుకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనపై ఇండియా సత్వరం నిర్ణయం తీసుకోవాలని అంటున్నాయి. లేకుంటే కొత్త తరం టెక్నాలజీ ప్రయోజనాల్ని అందిపుచ్చుకోలేమని నోకియా ఇండియా(Nokia india)తెలిపింది. 5జీ నెట్‌వర్క్‌ను కేవలం ఆపరేటర్ల వ్యాపారంగా భావించకూడదని..దేశానికి ప్రపంచానికి ఆర్ధికపరమైన ప్రయోజనాలు చేకూర్చేందుకు ఇది చాలా అవసరమని చెబుతోంది. ఇండియాలో 5జీ సిద్దం చేస్తున్నామని..పరిస్థితులన్నీ అనుకూలిస్తే 3 నెలల్లోనే వినియోగంలో తీసుకురావచ్చని అంటున్నాయి టెలీకం కంపెనీలు.  

కొత్త టెక్నాలజీ(New Technology)ని అభివృద్ధి చేయడమనేది ఇండియాలో వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారమని టెలీకం ఎక్స్‌పోర్ట్ ప్రమోషనల్ కౌన్సిల్ భావిస్తోంది. రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా ఉండటమే కారణమని అంటున్నాయి. మరోవైపు చైనాలో కొత్త టెక్నాలజీ అభివృద్ధికి స్థానిక కంపెనీలకు 2 వందల బిలియన్ డాలర్ల వరకూ ప్రభుత్వమే సమకూరుస్తోందనే సంగతిని గుర్తు చేసింది.

Also read: Mamata Banerjee Health: మమతా బెనర్జీ ఆరోగ్యంపై హెల్త్ బుల్లెటిన్ విడుదల చేసిన వైద్యులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News