Supreme Court Granted Bail To Delhi CM: దేశ రాజధాని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సుప్రీం కోర్టు ఆయనకు నేడు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, సుప్రీం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. లిక్కర్‌ కేసు గురించి మాట్లాడకూడదని కేజ్రీవాల్‌కు షరతు విధించింది. ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్‌ పొందారు ఈ ఢిల్లీ సీఎం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లిక్కర్‌ కేసులో అరెస్టయిన్‌ ఢిల్లీ సీఎం కేసులో ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. ఆరునెలల తర్వాత ఆయన జైలు నుంచి విడుదల కాబోతున్నారు. అయితే న్యాయ ప్రక్రియలో సుదీర్ఘ కారాగారం అంటే స్వేచ్చను హరించడమేనని పరిగణలోకి తీసుకుని ఈ బెయిల్‌ మంజూరు చేశారు. 


అయితే, ఈడీ కేసులో ఇప్పటికే సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్‌ లభించింది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో విచారణ ఆయన్ను జూన్‌ నెలలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్‌ లభించింది. దీంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ లిక్కర్‌ కేసుకు సంబంధించిన విషయాలు ఎవరితోనూ మాట్లాడుకూడదనే షరతు విధించి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది.


ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో నిలిచిపోయిన పౌర సేవలు.. 3 రోజులుగా ప్రజల ఇబ్బందులు..


ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ 2021 అవకతవకలు, మనీలాండరీంగ్‌ విచారణకు సంబంధించి ఈయన మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. ఎక్సైజ్‌ కేసు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ కస్డడీలో ఉన్న ఆయన్ను సీబీఐ జూన్ 26న అరెస్టు చేసింది.


ఇదీ చదవండి: ల్యాబ్‌ టెక్నీషియన్‌ జాబ్‌ నోటిఫికేషన్‌.. అర్హత, జీతం పూర్తి వివరాలు తెలుసుకోండి..


ఇన్ని రోజులు తీహార్‌ జైళ్లో నుంచి బయటకు రానున్నారు. ఈ సాయంత్రం జైలు నుంచి విడుదలవుతారు. 10 లక్షల పూచీకత్తుతోపాటు ఇద్దరి ష్యూరిటీతో అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. జస్టీస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం. కేజ్రీవాల్‌ కేసు చట్టవిరుద్ధం కాదు, సుదీర్ఘ కారాగారం అంటే స్వేచ్చను హరించడం అని అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్‌ మంజూరైన సంగతి తెలిసిందే.


ఢిల్లీ లిక్కర్‌ కేసు అంటే ఏంటి?
ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీలోని మద్యం విక్రయాలను ఆప్‌ ప్రభుత్వం 2021 కొత్త లిక్కర్‌ పాలసీని అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త పాలసీలో టెండర్లను ఆహ్వానిస్తారు. దీని ప్రధాన లక్ష్యం ప్రైవేటు వ్యక్తులకు టెండర్లో అప్పగించడం. దీనిపై వచ్చే లైసెన్స్‌ ఫీజు, మద్యం విక్రయాల్లో వచ్చే ట్యాక్స్‌ను ఈ ప్రభుత్వం వసూలు చేస్తుంది. అయితే, ఆప్‌ ప్రభుత్వం ఈ కొత్తపాలసీ పన్నులో అపరిమిత రాయితీ ఇచ్చింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.