Union Budget: ఫిబ్రవరి 1 నుంచి మారుతున్న 5 అంశాలివే..
నేడు Union Budget 2020ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. అయితే ఫిబ్రవరి 1 నుంచి కొన్ని అంశాలకు కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
నేడు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన శనివారం ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెడతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో పర్యాయం కేంద్ర బడ్జెట్ (Union Budget 2020)ను పార్లమెంట్‌లో ప్రతిపాదించనున్నారు. అయితే ఫిబ్రవరి 1 నుంచి ముఖ్యంగా 5 అంశాలు మారబోతున్నాయి. ఆ అయిదు మారనున్న అంశాలు, వాటివల్ల ప్రజలపై ప్రభావం వివరాలపై ఓ లుక్కేయండి.
ఇన్సూరెన్స్ పాలసీలు
ఇన్సూరెన్స్ పాలసీలను నియంత్రించే ఐఆర్‌డీఏఐ కొత్త ఇన్సూరెన్స్ నియమాలను తీసుకొచ్చింది. యులిప్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ (ఎల్‌ఐసీల)లకు రూల్స్ వర్తించనున్నాయి. కొత్త నిబంధనలు శనివారం (ఫిబ్రవరి 1వ తేదీ) నుంచే అమలులోకి రానున్నాయి. 31 జనవరి 2020 తర్వాత ఎల్‌ఐసి 23 పాలసీలను నిలిపివేస్తోంది. జీవిత బీమా కంపెనీలు జీవిత బీమా మరియు రైడర్‌లను నిలిపివేయనుంది. వీటిని రద్దు చేసేందుకు కంపెనీకి 30 నవంబర్ 2019 చివరి తేదీ. అయితే ఈ గడువును జనవరి 31వరకు పొడిగించారు.
Also Read: బడ్జెట్ అంటే ఏమిటి.. Budget ఎందుకు ప్రవేశపెడతారు?
పాత మాగ్నెటిక్ కార్డులు పనిచేయవు
నేటి నుంచి పాత మాగ్నెటిక్ కార్డులు పనిచేయవు. మీతో పాత కార్డులు (డెబిట్, క్రెడిట్ కార్డులు) ఏమైనా ఉంటే, దాన్ని వెంటనే మార్చుకోవడం బెటర్. లేనిపక్షంలో నగదు విత్ డ్రా చేసుకోవడం వీలుకాదు. కాగా, పాత మాగ్నెటిక్ ఎటిఎం కార్డులకు బదులుగా చిప్ ఏటీఎం కార్డులను ఇదివరకే కొందరు కస్టమర్లకు బ్యాంకులు పోస్ట్ ద్వారా పంపించాయి. తాజా కార్డులు మాగ్నటిక్ కార్డుల కంటే సురక్షితమైనవని ఆర్‌బీఐ తెలిపింది.
వాట్సాప్ బంద్
ఫిబ్రవరి 1 నుంచి మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొన్ని మొబైల్స్‌లలో పనిచేయదు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ పాత వెర్షన్లు వాడుతున్న వారికి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఐఓఎస్8 అంతకన్నా ముందు వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) వాడుతున్న స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఆండ్రాయిడ్ 2.3.7, అంతకుముందు వెర్షన్ ఓఎస్ ఉన్న మొబైల్స్‌లోనూ నేటినుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి.
Also Read: కేంద్ర బడ్జెట్ 2020లో ఆశించే అంశాలివే!
పెరగనున్న మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు
ఫిబ్రవరి 1 2020 నుంచి దిగుమతి సుంకాలను 50 రకాల వస్తువులపై పెరగనుంది. నేడు ఎన్డీఏ సర్కార్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. దేశీయ పరిశ్రమల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 50 రకాల వస్తువులపై దిగుమతి పన్ను పెంచింది. ఎలక్ట్రికల్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు మరియు హస్తకళా వస్తువులు ఈ కేటిగిరీలో ముఖ్యమైనవి. అలాగే పారిశ్రామిక రసాయనాలు, ల్యాంప్స్, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, కృత్రిమ ఆభరణాలు, చెక్క ఫర్నిచర్, కొవ్వొత్తులు ఇకనుంచీ మరింత ఖర్చుతో కూడుకోనున్నాయి. మొబైల్ ఫోన్ల ధరలకు రెక్కలు రానున్నాయి.
ఎల్‌పీజీ ధరలకు రెక్కలు
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఎల్‌పీజీ ధరలు పెరుగుతాయి. ఎయిర్ టర్బైన్ ఇంధన ధరలు కూడా పెరగనున్నాయి. ఎల్‌పీజీ ధరలు అంతర్జాతీయంగా కూడా పెరగనున్న విషయం తెలిసిందే.