Banking services: ఆదివారం బ్యాంకులకు సెలవు లేదు.. కస్టమర్లకు అందుబాటులో ఈ సర్వీసులు..
Banking services: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదివారంతో ముగియనున్న వేళ.. దేశం లోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా శని, ఆదివారాల్లో సేవలు అందించాలంటూ 33 బ్యాంకు లకు ఆర్బిఐ ఆదేశాలు జారీ చేసింది.
These Banks Will Be Open On Sunday March 31 2024: సాధారణంగా మన నిత్యజీవితంలో ప్రతిఒక్క పని డబ్బులతో ముడిపడి ఉంటుంది. ఉదయంలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాక డబ్బుల లావాదేవీలు చేస్తుంటాం. దీనిలో కొన్ని ఆన్ లైన్ లో చేస్తే, మరికొన్ని ఆఫ్ లైన్ లో మనం చేస్తుంటాం. ఈ క్రమంలో డబ్బుల కోసం లేదా బ్యాంక్ కు సంబంధించిన అనేక లావాదేవీల కోసం తరచుగా బ్యాంకు లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం క్లోసింగ్ శనివారం, ఆదివారం వచ్చింది. అందుకే శనివారం, ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. నార్మల్ గా బ్యాంకులకు రెండో శనివారం, నాల్గవ శనివారం, ప్రతి ఆదివారం సెలవులు ఉంటాయని విషయం మనందరికి తెలిసిందే.
కానీ ఈసారి ఇయర్ ఎండింగ్ క్లోసింగ్ తేదీలు 30,31న రావడం వల్ల శని, ఆదివారం కూడా బ్యాంకులు చేయనున్నట్లు సమాచారం. ఈ లిస్ట్ లో ౩౩ బ్యాంకులు ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఈ ఆదేశాలతో భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బిఐ) సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ సహా 20 ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకు డిబిఎస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లు ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ సాధారణం గానే పని చేస్తాయి. నెఫ్ట్, ఆర్‌టిజిఎస్ తో పాటు చెక్ క్లియరెన్స్ వంటి సేవలు యథాతథంగా కొనసాగుతాయి. ఆదివారం నాడు బ్యాంకుల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
RBI మార్గదర్శకాల ప్రకారం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రెండు రోజులూ బ్యాంకులు నార్మల్ గా రోజులాగే పని చేస్తాయి. సాధారణ సమయాల ప్రకారమే బ్యాంకులున్న పనివేళలను పాటిస్తాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) రెండూ మార్చి 31 అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయి.
రెండు రోజుల్లో చెక్ క్లియరింగ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని బ్యాంకు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగస్థులు, వ్యాపారులు ఆదివారం రోజున తమ బ్యాంక్ కు సంబంధించిన ఏదైన లావాదేవీలు ఉంటే హ్యాపీగా చేసుకొవచ్చని కూడా బ్యాంక్ అధికారులు పేర్కొంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook