Election Rules: ఎన్నికలొస్తుంటాయి..పోతుంటాయి. గెలుపోటములు సహజం. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక మాత్రం చాలామందిలో ఉంటుంది. తెలిసో తెలియకో చేసే పొరపాట్ల కారణంగా నామినేషన్లు చెల్లకుండా పోతుంటాయి. అందుకే ఎన్నికల్లో పోటీ చేయాలంటే తప్పసరిగా తెలుసుకోవల్సిన విషయాలు ఇవి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) సందడి నడుస్తోంది. కొత్త కొత్త పార్టీలు, కొత్త కొత్త అభ్యర్ధులు రంగంలో దిగుతున్నారు. రాజకీయాలంటే ఆసక్తి ఉండి..సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపన ఉంటే ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. సహజంగానే ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక చాలామందికి ఉంటుంది. అయితే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా నామినేషన్ చెల్లకుండా పోయే సందర్భాలు చాలా ఉంటుంటాయి. అందుకే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే..ముందుగా ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. 


అసలు ఎన్నికల్లో పోటీ చేయాలంటే కావల్సిన అర్హత ఏంటి, ఏయే పత్రాలు సమర్పించాలనేది తెలుసుకుందాం. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా భారతీయ పౌరుడై ఉండాలి. ఓటరు జాబితాలో తప్పనిసరిగా పేరు నమోదై ఉండాలి. అదే నియోజకవర్గంలో ఓటు ఉండాల్సిన అవసరం లేదు. ఓటెక్కడ వేసినా..మరెక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే 25 ఏళ్ల వయస్సుండాలి. మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. 


1996 కంటే ముందు సెక్షన్ 33 ప్రకారం ఓ వ్యక్తి ఎన్ని నియోజకవర్గాల్లో అయినా పోటీ చేసే పరిస్థితి ఉండేది. ఆ తరువాత ఈ నిబంధన మార్చారు. సెక్షన్ 33 క్లాజ్ 7 ప్రకారం ఇప్పుడు గరిష్టంగా 2 స్థానాల్లోనే పోటీ చేయగలడు. రెండింటిలోనూ గెల్చినప్పుడు ఒక స్థానం వదులుకోవల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు సూచించిన అన్ని దరఖాస్తులు పూరించాల్సి ఉంటుంది. వ్యక్తిగత గుర్తింపు, చిరునామా, వయస్సు, ఆస్థులు, కోర్టు కేసులు అన్ని వివరాలకు సంబంధించిన పత్రాలు సమర్పించాలి. అంతేకాకుండా ఇంటి పన్ను చెల్లింపు రసీదు, ఇతర పన్నుల రసీదు సమాచారం అందించాలి. పార్టీ నుంచి పోటీ చేస్తే..గుర్తు కేటాయింపు ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాలి. 


ఇద్దరు సాక్ష్యులతో కూడిన అఫిడవిట్ సమర్పించాలి. ఇందులో తన గురించి, తన ఆస్థి గురించి సమగ్ర సమాచారం ఇవ్వాలి. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రక్రియ ఉంటుంది. ఆఫ్‌లైన్ విధానంలో ఎంపిక చేయాలంటే కలెక్టరేట్‌లో చేయాల్సి ఉంటుంది. https/suvidha.eci.gov.in సందర్శించడం ద్వారా ఆన్‌లైన్ మాధ్యమంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ప్రక్రియ..దరఖాస్తు, అఫిడవిట్, అప్రూవల్ అంటూ మూడు దశల్లో ఉంటుంది.


Also read: India Covid-19 Update: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..మెుత్తం కేసులు ఎన్నంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి