Third Wave in India: ఫిబ్రవరి నాటికి ఇండియాలో కరోనా థర్డ్ వేవ్: ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు!
Third Wave in India: దేశంలో ఫిబ్రవరి 3, 2022 నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు తమ నివేదికలో వెల్లడించారు.
Third Wave in India: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron Variant) కల్లోలం సృష్టిస్తోంది. యూకేలో లక్షల్లో కేసులు వెలుగుచూస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇండియాలో సైతం ఒమిక్రాన్ కేసులు (Omicron Cases in India) పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ కేసులు 350 దాటాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3, 2022 నాటికి భారత్‌లో గరిష్ట స్థాయికి కేసులు చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు (IIT Kanpur researchers) పేర్కొంటున్నారు. గాస్సియన్ మిక్సర్ మోడల్ (Gaussian Mixture model)ను ఉపయోగించి వారు ఈ అంచనాకు వచ్చారు. ప్రస్తుతమున్న పరిస్థితి చూస్తుంటే...వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి నాటికి కరోనా థర్డ్ వేవ్ (Third Covid-19 wave in World Wide) ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు.
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ డేటాతో పాటు ఒమిక్రాన్ కేసుల పెరుగుదల ఆధారంగా ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు నివేదిక రూపొందించారు. దేశంలో తొలి కరోనా కేసు జనవరి 30, 2020న నమోదైనట్లు వారు గుర్తించారు. దేశంలో ఈ నెల మధ్య నుంచి మూడో వేవ్ (Third Wave in India) ప్రారంభమై.. ఫిబ్రవరి ప్రారంభంలో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని పరిశోధకులు అంచనా వేశారు. గతంలోనూ కరోనా సెకండ్ వేవ్ విషయంలో ఐఐటీ కాన్పూర్ పరిశోధకుల వేసిన అంచనాలు నిజమయ్యాయి. ఇప్పుడు థర్డ్ వేవ్‌పై వారు చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి.
Also Read: Omicron cases in India: దేశంలో ఒమిక్రాన్ విజృంభణ- మొత్తం కేసులు @ 358
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి