Omicron cases in India: దేశంలో కరోనా ఒమిక్రాన్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా (Total Omicron cases in India) 358 కేసులు బయటపడ్డట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇందులో ఇప్పటి వరకు 114 మంది కోలుకున్నారని తెలిపింది.
అత్యధికం ఆ రాష్ట్రాల్లోనే..
మాహారాష్ట్రలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు (Omicron cases in Maharastra) నమోదయయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 88 కేసులు నమోదవగా.. అందులో 42 మంది కోలుకున్నారు.
ఢిల్లీలో 67 ఒమిక్రాన్ కేసులు (Omicron cases in Delhi) బయపడ్డాయి. 23 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు 38 ఒమిక్రాన్ కేసులు (Omicron cases in Telangana) నమోదయ్యాయి. తమిళనాడులో 34 కేసులు బయపడ్డాయి.
కర్ణాటకలో 31 ఒమిక్రాన్ కేసులు నమోదవగా.. గుజరాత్లో 30 కేసులు, కేరళలో 27 కేసులు, రాజస్థాన్ 22 కేసులు వెలుగు చూశాయి.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
హరియాణా (4), ఒడిశా (4), జమ్ము కశ్మీర్ (3), పశ్ఛిమ్ బెంగాల్ (3), ఆంధ్ర ప్రదేశ్ (2), ఉత్తర్ ప్రదేశ్ (2), చంఢీగఢ్ (1), లద్దాఖ్ (1), ఉత్తరఖండ్ (1) చొప్పున కేసులు నమోదైనట్లు ఆరోగ్య విభాగం పేర్కొంది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/w7bTeypumG pic.twitter.com/LIBJ5kaemJ
— Ministry of Health (@MoHFW_INDIA) December 24, 2021
మొత్తం కరోనా కేసుల్లో మాత్రం స్వల్ప తగ్గుదల నమోదైంది. కొత్తగా 6,650 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. నిన్న 7 వేలకుపైగా కేసులు వచ్చాయి.
ఒమిక్రాన్ విజృంభన భయాలతో కేంద్రం ఇప్పటికే అప్రమత్తమైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధం కావాలని సూచించింది. పండుగ సీజన్ నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూ, జన సముహాలు, పబ్లిక్ మీటింగ్స్ వంటి వాటిపై ఆంక్షలు విధించాలని సూచించింది.
Also read: Corona cases in India: దేశంలో తగ్గిన కరోనా కేసులు- ఆందోళనకరంగా ఒమిక్రాన్ వ్యాప్తి
Also read: Omicron Scare: అవసరమైతే రాత్రి పూట కర్ఫ్యూ.. రాష్ట్రాలకు కేంద్రం సూచన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook