Corona Third Wave: దేశంలో నమోదైన 58,097 కరోనా కేసులు, 534 మరణాలు
Corona Cases Today: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 58,097 కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి మరో 534 మంది మరణించారు.
Corona Cases in India: దేశంలో భారీగా కరోనా కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో 58,097 కేసులు (Corona cases in india) నమోదయ్యాయి. వైరస్ తో 534 మంది ప్రాణాలు (COVID-19 Death in India) కోల్పోయారు. ఇదిలా ఉండగా మరోవైపు 15,389 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.18 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
దేశంలో 2,14,004 యాక్టివ్ కేసులు (Corona Active cases in india) ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 3,43,21,803 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొవిడ్ ధాటికి మొత్తంగా 4,82,551 మంది మరణించారు. దేశంలో టీకా పంపిణీ (Corona Vaccination) శరవేగంగా కొనసాగుతోంది. మంగళవారం మరో 96,43.238 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 147.72 కోట్లకు చేరింది.
Also read: IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కరోనా కలకలం... 60 మందికి కొవిడ్ పాజిటివ్!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒక్కరోజే 21 లక్షల 44వేల 095 కేసులు (World Wide covid Cases) వెలుగులోకి వచ్చాయి. 6,656 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో కొత్తగా 5,67,696 కేసులు నమోదయ్యాయి. 1,847మంది ప్రాణలు కోల్పోయారు. ఫ్రాన్స్‌లో2,71,686 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 351 మంది మరణించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook