New rules to Central employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేపటి నుంచి (నవంబర్ 8 సోమవారం నుంచి) కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. కరోనా కారణంగా ఇచ్చిన వెసులుబాట్లు నేటితో ముగియనున్నాయని (COVID facility end from tomorrow) కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ కార్యదర్శి ఉమేశ్​ కుమార్ బాటియా తెలిపారు. ఇందుకు సంబందించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటి వరకు ఉన్న వెసులుబాట్లు ఇవే..


దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పలు వెసులుబాట్లు కలిపించింది కేంద్రం. ముఖ్యంగా పని గంటలు కుదించడం, తక్కువ సంఖ్యలో ఉద్యోగులు పని చేసేలా మార్పులు చేసింది. ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కూడా కొంత మందికి కల్పించింది. కరోనా కట్టడిలో భాగంగా గత ఏడాది ఈ నిర్ణయాలు తీసుకుంది కేంద్రం.


ప్రైవేటు సంస్థలు కూడా గతంలో ఇలాంటి వెసులుబాట్లు ఇచ్చాయి. ఇందులో చాలా వరకు కంపెనీలు ఇప్పుడు మళ్లీ పాతపద్దతిలో పనులు చేయించుకుంటున్నాయి. మరిన్ని సంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.


Also read: యమునా నదిలో ప్రమాదకర స్థాయికి 'అమోనియా'... దిల్లీకి నిలిచిన నీటి సరఫరా!


వెసులుబాట్ల తొలగింపు ఎందుకు?


దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతమైంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు కల్పించిన తాత్కాలిక వెసులుబాట్లను నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీనితో రేపటి కేంద్ర ప్రభుత్వ కార్యలయాలు పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించనున్నయి. ఉద్యోగులు పూర్తి స్థాయిలో హాజరవనున్నారు.


Also read: Aryan Khan Case: 'ఆర్యన్​ ఖాన్​ను కిడ్నాప్​ చేశారు': మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​


Also read: Chennai Heavy Rain: భారీవర్షం కారణంగా చెన్నైలో నిలిచిన ట్రాఫిక్.. నీటమునిగిన ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటన


దేశంలో కరోనా అప్​డేట్​..


దేశంలో శనివారం 10,853 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ (Coroan cases in India) అయ్యింది. మహమ్మారి కారకణంగా మరో 526 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 12,432 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. 


వ్యాక్సినేషన్​ను విషయానికొస్తే.. శనివారం ఒక్కరోజే 28,40,174 డోసుల కొవిడ్​ టీకాలు పంపిణీ చేశారు. ఫలితంగా దేశవ్యాప్తంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,08,21,66,365 కు చేరింది.


Also read: PM Modi: ప్రపంచంలోనే పాపులారిటీలో నెంబర్‌ వన్‌గా మోదీ..తర్వాత స్థానాల్లో ఎవరెవరు ఉన్నారంటే..


Also read: BJP MP Controversial Comments:మా నేతను అడ్డుకుంటే కళ్లు పీకేస్తా.. చేతులు నరికేస్తానంటూ వార్నింగ్


రేపటి నుంచి కొత్త రూల్స్..


కరోనా కేసులు తగ్గినప్పటికీ.. భయాలు పూర్తిగా తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో పని ప్రదేశాల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై కూడా కేంద్రం కీలక సూచనలు చేసింది.


ఉద్యోగుల హాజరు నమోదు చేసే బయోమెట్రిక్ యంత్రాలను బహిరంగ ప్రదేశాల్లో ఉంచాలని సూచించింది. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేయాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా నియమించిన సిబ్బందిని వినియోగించుకోవాలని సూచించింది కేంద్రం.


ఉద్యోగులు కూడా బయోమెట్రిక్​కు ముందు, తర్వాత చేతుల్ని శానిటైజ్ చేసుకోవాలని స్పష్టం చేసింది. పని ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోవడం కూడా తప్పనిసరి చేసింది ప్రభుత్వం.


Also read: Rakesh Tikait: 'బీజేపీ, ఆరెస్సెస్​ ప్రజల ఐక్యతను దెబ్బతియాలనుకుంటున్నాయి జాగ్రత్త'


Also read: Pradhan Mantri Garib Kalyan Yojana: ఉచిత రేషన్ పథకం నవంబర్ 30 తర్వాత నిలిపివేత!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook