Rakesh Tikait: 'బీజేపీ, ఆరెస్సెస్​ ప్రజల ఐక్యతను దెబ్బతియాలనుకుంటున్నాయి జాగ్రత్త'

Rakesh Tikait: ఆరెస్సెస్​, బీజేపీతో జాగ్రత్తగా ఉండాలని రైతు సంఘాల నేత రాకేస్ టికాయిత్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ప్రజలను విడదీసేందుకు వారు ఎంత దూరమైన వెళ్తారని విమర్శించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 07:01 PM IST
  • బీజేపీ, ఆరెస్సెస్​లతో జాగ్రత్తగా ఉండాలన్న రాకేశ్​ టికాయిత్​
  • ప్రజలను ఐక్యతను తెంచేందుకు ఎంత దూరమైన వెళ్తారని ఆరోపణ
  • రైతు నిరసనలకు ఏడాది కావొస్తున్న నేపథ్యంలో బీకేయు నేత వ్యాఖ్యలు
Rakesh Tikait: 'బీజేపీ, ఆరెస్సెస్​ ప్రజల ఐక్యతను దెబ్బతియాలనుకుంటున్నాయి జాగ్రత్త'

Rakesh Tikait criticised BJP, RSS: రైతుల సంఘాల నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్​ (BKU) ప్రతినిధి రాకేశ్​ టికాయిత్​.. బీజేపీ, ఆరెస్సెస్​లపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రజలను, వారి మధ్య ఐక్యతను విడదీసేందుకు వారు ఎంత దూరమైనా వెళ్తారని (Rakesh Tikait on RSS, BJP) విమర్శించారు. అందుకే దేశ ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

రైతుల ఆందోళనకు ఏడాది కావొస్తోంది..

కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం ప్రారంభించి ఏడాది కావస్తున్న నేపథ్యంలో రాకేశ్ టికాయిత్​ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇంకా ఎంతకాలం ఉద్యమం సాగాలని కోరుకుంటుందని ప్రశ్నించారు. కేంద్రం ఇకనైనా రైతులతో చర్చలు జరపాలన్నారు. కేంద్రం ముందుకు రాకుంటే.. ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని వెల్లడించారు.

త్వరలో నిరసనలు మరింత ఉదృతం కానున్నట్లు వెల్లడించారు రాకేశ్ టికాయిత్​. మరిన్న రాష్ట్రాలు కూడా నిరసనల కోసం సిద్దమవుతున్నాయని (Rakesh Tikaith on Farmers Protests) పేర్కొన్నారు. చలికాలం నేపథ్యంలో రైతులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Also read: Yogi Adityanath: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఎక్కడి నుంచి పోటీ... ఇదీ ఆయన రియాక్షన్

ఉప ఎన్నికల్లో ఓటమిపై టికాయిత్ ఏమన్నారంటే?

ఇటీవల జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి ఈ నెల రెండున ఫలితాలు (Rakesh Tikaith on by Election Results) వెలువడ్డాయి. ఇందులో బీజేపీకి చాలా చోట్ల చుక్కెదురైంది. ముఖ్యగా హిమాచల్ ప్రదేశ్​, హరియాణా, రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థులు ఓటమి పాలవడం.. తమ ఉద్యమ ప్రభావమేనని రాకేశ్​ టికాయిత్ ఇటీవల తెలిపారు. హరియాణా రైతులు పెద్ద ఎత్తున సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న నేపథ్యంలో వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో అసంతృప్తి ఇందుకు నిదర్శమని వివరించారు.

Also read: Pradhan Mantri Garib Kalyan Yojana: ఉచిత రేషన్ పథకం నవంబర్ 30 తర్వాత నిలిపివేత!

Also read: Former MP assaulted: తాగిన మత్తులో గుర్తు తెలియని ఇంటికెళ్లిన మాజీ ఎంపీ- చితక బాదిన ఓనర్​!

కేంద్రానికి హెచ్చరిక..

రైతు సంఘాల ఆందోళనల నేపథ్యంలో దిల్లీ సరిహద్దులైన.. గాజీపుర్​, టిక్రీ వద్ద ఇటీవలే పోలీసులు బారీకేడ్లను తొలగించారు. ఉన్నతాధికారుల స్పష్టమైన ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో టెట్లను బలవంతంగా తొలగించేదుకు ప్రభుత్వం ప్రయత్నించొచ్చని వార్తలు వచ్చాయి. గత వారం దీనిపై స్పందించిన రాకేశ్ టికాయిత్​ కేంద్రం అలా చేస్తే.. ప్రభుత్వ ఆఫీసులన్నిటిని ధాన్యం కొనుగోలు చేసే మండీలుగా మారుస్తామని హెచ్చరించారు.

Also read:Edible Oil Price Reduced: దేశంలో భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు.. లీటరుకు రూ.5 నుంచి రూ.20 తగ్గింపు

Also read: Mumbai Cruise Drug Case: ఆర్యన్ ఖాన్ కేసు విచారణ నుంచి వాంఖడేను తొలగించిన ఎన్సీబీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News