Gautam Gambhir: `గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ వచ్చింది పాకిస్థాన్ నుంచే`..!
Threat Emails to Gautam Gambhir: ఎంపీ గౌతమ్ గంభీర్‌కు వచ్చిన బెదిరింపు ఈ-మెయిళ్లపై పురోగతి సాధించారు ఢిల్లీ పోలీసులు. ఈ-మెయిల్ మూలాలు పాకిస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించారు.
Threatening emails to Gautam Gambhir traced to Pakistan: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గంభీర్‌ను చంపుతామంటూ వచ్చిన ఈ-మెయిల్స్‌పై ఢిల్లీ పోలీసులు విచారణ చెపట్టి.. పురోగతి సాధించారు. గంభీర్‌కు మెయిల్స్ పంపింది.. పాకిస్థాన్ నుంచేనని గుర్తించారు పోలీసులు.
విచారణలో భాగంగా గూగుల్ సహాయం తీసుకున్న పోలీసులు.. పాకిస్థాన్‌లోని ఓ కాలేజీ విద్యార్థి ఈ-మెయిల్స్ (Pak student threat mails to Gambhir) పంపినట్లు తెలుసుకున్నారు.
మెయిల్స్ పంపిన వ్యక్తి వయస్సు 25-26 మధ్య ఉంటుందని.. అతడు కరాచీలోని సింధ్ యూనివర్సిటీలో చదువుతున్నట్లు గుర్తించారు. అయితే ఈ విషయంపై ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
Also read: Kangana Ranaut : సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ కంగనాకు ఢిల్లీ అసెంబ్లీ నుంచి సమన్లు
Also read: Road Accident: సత్నా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...కుటుంబం దుర్మరణం
మెయిల్స్‌లో ఏముందంటే..
గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుంచి.. ‘ఐఎస్‌ఐఎస్, కశ్మీర్' ఐడీతో గంభీర్‌కు ఇటీవల ఓ ఈ-మెయిల్ వచ్చింది. అందులో గంభీర్ ఇంటికి సంబంధించి వివరాలు (threat mails to Gambhir from ISIS) ఉన్నాయి. ప్రాణహాని తలపెడతామని ఆ ఈ-మెయిల్ పంపిన వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఆ తర్వాత అదే మెయిల్ నుంచి మరుసటి రోజు మరో ఈ-మెయిల్ వచ్చింది. అందులో రాజకీయాలకు, కశ్మీర్ అంశానికి దూరంగా ఉంటేనే ప్రాణాలు దక్కుతాయని మరోసారి ఆ వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు వెల్లడైంది. దీనితో గంభీర్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు.
గౌతమ్ గంభీర్ ఫిర్యాదుపై ఢిల్లీ సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ ఈ విషయంపై విచారణ చేపడుతున్నట్లు బుధవారం తెలిపారు. తాజాగా దీనిపై పురోగతి సాధించారు.
Also read: Subramanian Swamy: 'ఆర్థికం నుంచి అంతర్గత భద్రత వరకు అన్నింటా ప్రభుత్వం ఫెయిల్'
Also read: Meghalaya Congress : మేఘాలయలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ..టీఎంసీలోకి 12 మంది ఎమ్మెల్యేలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook