Subramanian Swamy: 'ఆర్థికం నుంచి అంతర్గత భద్రత వరకు అన్నింటా ప్రభుత్వం ఫెయిల్​'

Subramanian Swamy: ప్రతి విషయంలో విఫలమయ్యారంటూ.. ప్రధాని మోదీపై బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి మరోసారి విమర్శలు చేశారు. ఆర్థికం నుంచి అంతర్గత భద్రత వరకు అన్ని విషయాల్లో మోదీ ఫెయిల్ అంటూ ట్వీట్ చేశారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2021, 02:47 PM IST
  • ప్రధానిపై మరోసారి సుబ్బమణియన్ స్వామి ఫైర్​
  • అన్ని రంగాల్లో విఫలమయ్యారని విమర్శలు
  • మోదీ రిపోర్ట్ కార్డు అంటూ ట్వీట్​​
Subramanian Swamy: 'ఆర్థికం నుంచి అంతర్గత భద్రత వరకు అన్నింటా ప్రభుత్వం ఫెయిల్​'

Rajya Sabha MP Subramaniam Swamy on Modi: బీజేపీ నేత, రాజ్య సభ ఎంపీ సుబ్రమణియన్​​ స్వామి.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. పాలన పరంగా అన్ని అంశాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందని  అన్నారు.

పశ్చిమ్ బెంగాల్ సీఎం, తృణమూల్​ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో బుధవారం సమావేశమైన సుబ్రమణియణఅ్ స్వామి.. ఆమెపై పొగడ్తల జల్లు కురిపించారు. మరునాడే (గురువారం) మోదీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం గమనార్హం.

మోదీ ప్రభుత్వ వైఫల్యాలు అంటూ ట్విట్టర్ వేదికగా సుబ్రమణియన్​ స్వామి విమర్శలు చేశారు స్వామి. మోదీ రిపోర్ట్ కార్డ్ అంటూ ట్విట్టర్​లో ఓ పోస్ట్ చేశారు. అందులో ఆర్థికంగా ఫెయిల్​, సరిహద్దు భద్రత పరంగా ఫెయిల్​ అని రాసుకొచ్చారు.

Also read: Truck: పెళ్లి ఊరేగింపు పైకి దూసుకొచ్చిన లారీ.. ముగ్గురి మృతి (వీడియో)

అఫ్గాన్ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ విదేశీ విధానాల్లో విఫలమయ్యారని, పెగసస్​ అంశన్ని ప్రస్థావిస్తూ.. జాతీయ భద్రత విషయంలో, కశ్మీర్​ అంశాన్ని ప్రస్తావస్తూ.. దేశీయ భద్రత విషయాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందని స్వామి పేర్కొన్నారు. వీటన్నింటికి ఎవరు బాధ్యులు అంటూ ప్రశ్నించారు.

ఈ విషయంపై కామెంట్లలో పలువురు చేసిన ప్రశ్నలకు కూడా స్వామి చెప్పారు. కొంత మంది పెట్రోల్, డీజిల్ ధరల గురించి అడగ్గా.. మోదీనే అడగండి అంటూ సమాధానమిచ్చారు.

Also read: Road Accident: సత్నా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...కుటుంబం దుర్మరణం

మమతపై ప్రశంసల జల్లు..

బుధవారం మమతా బెనర్జీతో భేటీ అయిన స్వామి.. అమెపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆమెన్ లోక్​ నాయక్ జయప్రకాశ్​ నారాయణ్​, మొరార్జీ దేశాయ్​, రాజీవ్​ గాంధీ, పీవీ  నరసింహారావుల వంటి వారితో పాల్చారు. తాను కలిసిన నిఖార్సైన మనషి  మమతా బెనర్జీనే అని పేర్కొన్నారు. అమె చెప్పిందే చేస్తారని.. రాజకీయాల్లో అది అరుదైన లక్షణమని వివరించారు.

అయితే సబ్రమణియన్​ స్వామి సొంత పార్టీని, ప్రధాని మోదీని విమర్శించడం ఇది తొలిసారి కాదు. ఇందకు ముందు కూడా చాలా అంశాల్లో కేంద్రంపై విమర్శలు చేశారు స్వామి. మోదీ విధానాల్లో లోపాలను ఎప్పటికప్పుడు తప్పుబడుతుంటారు.

Also read: Meghalaya Congress : మేఘాలయలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ..టీఎంసీలోకి 12 మంది ఎమ్మెల్యేలు

Also read: Kangana Ranaut : సిక్కుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిందంటూ కంగ‌నాకు ఢిల్లీ అసెంబ్లీ నుంచి స‌మ‌న్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News