Mukesh Ambani: భారత అపర కుబేరుడు, రిలయన్స్  ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మెన్ ముఖేష్ అంబానీ కుటుంబం మరోసారి కలవరానికి గురైంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆందోళన పడింది. ఇందుకు కారణం బెదిరింపు కాల్స్ రావడమే. ముఖేష్ అంబానీతో పాటు ఆయ‌న ఫ్యామిలీ మెంబర్స్ కు సోమ‌వారం మూడు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. రిల‌య‌న్స్ ఫౌండేష‌న్‌కు చెందిన హ‌రికిష‌న్‌దాస్ హాస్పిటల్ నెంబ‌ర్‌కు అగంతకుడి నుంచి వార్నింగ్ కాల్స్ వ‌చ్చాయి. బెదిరింపు కాల్స్ పై  రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ ఫిర్యాదు చేసింద‌ని ముంబై పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన ముంబై పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అఫ్జల్ అనే వ్యక్తి  ముంబైలోని గిర్గావ్‌లోని రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు బెదిరింపు కాల్స్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. కాల్ చేసిన ఫోన్ నంబర్‌ సాయంతో నిందితుడిని పోలీసులు గుర్తించారు.ఫోన్‌ చేసిన అఫ్జల్ కు మతిస్థిమితం లేనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలుస్తోంది.   రిల‌య‌న్స్ ఫౌండేష‌న్‌కు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు... ఫోన్ చేసిన వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు.


గత ఏడాది ముంబైలోని ముకేష్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియోను గుర్తించారు. కారులో బెదిరింపు లేఖ‌ను కూజా పోలీసులు గుర్తించారు.  ఈ ఘటన జరిగిన వారం రోజులకు ఆ స్కార్పియో కారు ఓనర్ మన్‌సుఖ్‌ హీరేన్‌ అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. ఈ కేసును ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ చీఫ్ స‌జిన్ వ‌జే పర్యవేక్షించాడు. అయితే తర్వాత కేసులో అతనే ప్రధాన సూత్రధారిడిగా తేలడం సంచలనం స్పష్టించింది. దీంతో కేసును ఎన్‌ఐఏతి బదలాయించారు. తాజాగా మరోసారి ముకేష్ అంబానీ కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది.


Read also: Jagan Govt: ఒక్క నిమిషం లేటైనా ఆబ్సెంటే! రేపటి నుంచే ఏపీ టీచర్లకు కొత్త సిస్టమ్..


Read also: వ‌న్‌ప్ల‌స్‌ టీవీపై రూ. 12వేల తగ్గింపు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా!ఈ అవకాశం ఒక్క రోజే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook