Omicron scare in India: దేశంలో కరోనా 'ఒమిక్రాన్​ వేరియంట్​' కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్రలో ఒక్కసారిగా ఏడు కేసులు వెలుగు (Omicron cases in India) చూశాయి. కరోనా నిర్ధారణ అయిన వారిలో మూడేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్తగా ఒమిక్రాన్​ సోకిన వారంతా.. బ్రిటన్​, దక్షిణాఫ్రికా, టాంజానియా వంటి దేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్న వారేనని గుర్తించారు అధికారులు.


ముంబయి, పింపిరి చించ్​వాడ్ మున్సిపల్ కార్పొరేషన్​​, పుణె ప్రాంతాల్లో ఈ కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులతో మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల (Total Omicron cases in Maharastra) సంఖ్య 17కు చేరింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 32కు (Corona Omicron cases in India) పెరిగింది.


ఒమిక్రాన్​ కేసుల పరంగా మహారాష్ట్ర (17) మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (9), గుజరాత్​ (3), కర్ణాటక (2), ఢిల్లీ (1) ఉన్నాయి.


లక్షణాలు లేకున్నా..


మహారాష్ట్రలో కొత్తగా కొవిడ్ సోకిన వారిలో నలుగురికి లక్షణాలు ఏవి లేవని.. ముగ్గురికి మాత్రం స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపారు అధికారులు. అయితే ఒమిక్రాన్​ సోకిన వారిలో చాలా వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారేనని తెలిపారు.


ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ భయాలు..


కరోనా ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుందన్న నమ్మకం వస్తున్న సమయంలో కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ బయటపడింది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ రకం కరోనా వైరస్​.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. దీనితో చాలా దేశాలు కఠిన ఆంక్షలు మళ్లీ అమలు చేస్తున్నాయి. ప్రయాణ ఆక్షలు, మాస్క్ పెట్టుకోవడం, వాక్సిన్​ వేసుకోవడం తప్పనిసరి వంటివి చేస్తున్నాయి.


మన దేశంలో కూకా వివిధ రాష్ట్రాలు ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి.


Also read: Death Threat to Mayor: నువ్వు దాదాతో చెలగాటం ఆడుతున్నావ్.. ఖబడ్దార్! మేయర్‌‌కు బెదిరింపులు


Also read: BJP MLA Jailed: భారతీయ జనతా పార్టీ MLAకి ఐదేళ్ల జైలుశిక్ష!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook