Tik Tok, Chinese apps banned: న్యూ ఢిల్లీ: టిక్ టాక్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్ సహా మొత్తం 59 మొబైల్ యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించింది. ఇటీవల భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటి నుంచే చైనా యాప్స్‌పై నిషేధం ( Ban on chinese apps) విధించాల్సిందిగా దేశ పౌరుల నుంచి బలమైన డిమాండ్ వినిపిస్తూ వస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఎట్టకేలకు కేంద్రం సైతం దీనిపై సంచలన నిర్ణయం తీసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చైనాతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో భారత ప్రభుత్వం మొత్తం 59 మొబైల్ యాప్స్‌ని నిషేధిస్తున్నట్టు స్పష్టంచేసింది. కేంద్రం నిషేధం విధించిన 59 మొబైల్ యాప్స్ డీటేల్స్ ఇలా ఉన్నాయి.