Election Survey: దేశంలో అటు కేంద్రంతో పాటు ఇటు కొన్ని రాష్ట్రాల్లో కూడా 2024లో ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ఈ క్రమంలో ప్రఖ్యాత మీడియా సంస్థలైన టైమ్స్ నౌ-నవభారత్ సర్వే ఫలితాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఊహించని విధంగా ఆ రెండు రాష్ట్రాల్లో సర్వే విభిన్నంగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. వైఎస్ జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు టీడీపీ-జనసేన-బీజేపీ ఏకమయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ బీజేపీ లేకపోయినా టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని తెలుస్తోంది. వైఎస్ జగన్ ఈసారి వైనాట్ 175 అంటుంటే ప్రతిపక్షాలు మాత్రం కచ్చితంగా అధికారం తమదే అంటున్నాయి. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ప్రఖ్యాత మీడియా సంస్థలైన టైమ్స్ నౌ-నవభారత్ సంస్థలు చేసిన సర్వే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో , కేంద్రంలో , తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం ఎవరిదే ఆ సంస్థ సర్వే తేల్చేసింది.


ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంట్ స్థానాల్లో మూడవ అతిపెద్ద పార్టీగా నిలవనుంది.  రాష్ట్రంలోని 25 స్థానాల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేయవచ్చని అంచనా. 2019లో వైసీపీ 22 స్థానాల్ని, టీడీపీ 3 స్థానాల్ని గెల్చుకుంది. కానీ ఇప్పుడు జరిగితే మాత్రం వైసీపీ తన బలాన్ని మరింత పెంచుకుని 24-25 సీట్లుసాధిస్తుందని అంచనా. అంతేకాకుండా వైసీపీకు 51.30 శాతం, టీడీపీకు 6.20 శాతం, జనసేనకు 10.10 శాతం, బీజేపీ 1.30 శాతం ఓట్లు సాధించవచ్చు.


నాలుగున్నరేళ్ల పాలనతో వైసీపీ తన ఓటు బ్యాంకును చెక్కుచెదరకుండా కాపాడుకుందని టైమ్స్ నౌ-నవభారత్ వెల్లడించింది. అదే జనసేన టీడీపీ కలిస్తే 26.30 శాతం ఓటు బ్యాంకు ఉంటుందని తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు టీడీపీ కంటే జనసేనకే ఎక్కువ మొగ్గు చూపించారు. 


ఇక తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు సాదించనుంది. బీఆర్ఎస్ పార్టీకు 37.10 శాతం ఓట్లు, బీజేపీకు 25.30 సాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకు 29.20 శాత ఓట్లు దక్కనున్నాయని టైమ్స్ నౌ నవభారత్ ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రజల మద్దతుతో అధికార పార్టీలో తిరిగి అధికారంలో వస్తాయని సర్వే తెలిపింది.


Also read: Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.. 29 మంది ఎమ్మెల్యేలతో జంప్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook