Amul Fire On Tirupati Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. జాతీయ వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దురుద్దేశపూరితమో.. వాస్తవమో తెలియదు కానీ తిరుపతి లడ్డూపై వివాదం కొనసాగుతోంది.తిరుమల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కన్నా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.ఈ వ్యవహారంలో తొలి కేసు నమోదైంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tirupati Laddu: శ్రీరాముడి విగ్రహం తల నరికితే ఎవరూ మాట్లాడలే? ఇప్పుడు కూడానా? పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం


కలియుగ వైకుంఠం.. శ్రీమహావిష్ణువు కొలువుదీరిన తిరుమలపై వివాదం చెలరేగడం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతుండగా.. కొన్ని రాష్ట్రాలకు కూడా ఈ వ్యవహారం పాకుతోంది. తాజాగా గుజరాత్‌లో తిరుపతి లడ్డూ వ్యవహారంపై కేసు నమోదైంది. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ సీఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు బయటపెట్టడంతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే.

Also Read: Tirumala Laddu: తిరుమల లడ్డూపై మరింత గందరగోళానికి తెరలేపిన టీటీడీ సంచలన ప్రకటన


 


ఈ వివాదంలో గుజరాత్‌కు చెందిన అమూల్ డెయిరీ సంస్థ ప్రమేయం కూడా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. జంతువుల కొవ్వు ఉన్న నెయ్యిని లడ్డూ తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి అమూల్‌ సంస్థ కూడా పంపించిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఆరోపణలపై అమూల్‌ సంస్థ అయిన 'గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ - అమూల్' వెంటనే స్పందించింది. తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించింది. ఈ సందర్భంగా ఓ ప్రకటన చేసింది.


'తిరుమల లడ్డూ తయారీ కోసం నెయ్యిని పంపించలేదు' అని అమూల్‌ సంస్థ స్పష్టం చేసింది. 'తిరుమలలో వినియోగించే నెయ్యితో మాకు ఏ మాత్రం సంబంధం లేదు' అని పేర్కొంది. తమపై దుష్ప్రచారం.. ఆరోపణలు చేస్తున్న వారిపై అమూల్ యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి అమూల్‌ సంస్థ ఫిర్యాదు చేసింది.


అమూల్ సేల్స్ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ హేమంత్ గౌని ఫిర్యాదు మేరకు గుజరాత్‌ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 'తిరుమల లడ్డూలకు జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని అమూల్ సరఫరా చేసిందంటూ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో న్యూస్ ఛానల్స్‌లో చూశా. దీనికి కారణం కొందరు ఎక్స్ యూజర్లు (ట్విటర్‌ ఖాతాదారులు' అని హేమంత్‌ గౌనీ తన ఫిర్యాదులో తెలిపారు. 'Spirit Of Congress, Banjara1991, chandanAIPC, SecularBengali, rahul_1700, profapm, prettypadmaja అనే ఎక్స్ అకౌంట్ యూజర్లపై గుజరాత్‌లో కేసు నమోదైంది. వివిధ సెక్షన్ల కింద ఆ ట్విటర్‌ ఖాతాదారులపై కేసు నమోదు చేశారు.
 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.