కరోనాతో మరో ఎమ్మెల్యే కన్నుమూత
ఇటీవల పుట్టినరోజు నాడే తమిళనాడు ఎమ్మెల్యే అన్బళగన్ కన్నుమూయడం తెలిసిందే. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో టీఎంసీ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్ కరోనా కారణంగా కన్నుమూశారు.
కరోనా వైరస్(CoronaVirus) మహమ్మారి బారిన పడి మరో ప్రజా ప్రతినిధి కన్నుమూశారు. తృణమూల్ కాంగ్రెస్(TMC) పార్టీ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్(60) కరోనాతో పోరాడుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. మే నెలలో లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా ఆయనకు కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. అప్పటినుంచీ ఆయన కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. వంద శాతం ఫలితాలతో వస్తున్న పతంజలి కరోనా మెడిసిన్ Coronil.. ధరెంతో తెలుసా!
తమోనాశ్ ఘోష్(Tamonash Ghosh)కు గుండె, మూత్రపిండాలు సంబంధిత అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. దీంతో నెల రోజులపాటు చికిత్స తీసుకున్నా ఆయన కరోనా బారి నుంచి కోలుకోలేకపోయారు. ఈ క్రమంలో టీఎంసీ ఎమ్మెల్యే తుదిశ్వాస విడిచారు. తమోనాశ్ మరణంపై సీఎం మమతా బెనర్జీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి విశేష సేవలందిస్తున్న నేత(Tamonash Ghosh Died) చనిపోయారు, ఇక ఆయన మధ్య లేరంటూ ఆవేదనతో మమత ట్వీట్ చేశారు. డిప్రెషన్‌తో ప్రమోషన్ ఐఏఎస్ అధికారి ఆత్మహత్య కలకలం
కాగా, ఇటీవల పుట్టినరోజు నాడే తమిళనాడు ఎమ్మెల్యే అన్బళగన్ కన్నుమూయడం తెలిసిందే. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ