బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. లాక్‌డౌన్ టైమ్‌లో అక్షయ తృతీయ రావడంతో మార్కె‌ట్ వెలవెలబోతోంది. ప్రతి ఏడాది ఈ సీజన్‌లో బంగారం ధర అమాంతం పెరిగేది. కానీ లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే.  మీ కళ్లు అలా మారితే బీ కేర్‌ఫుల్!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ మార్కెట్లలో నేడు తులం (10 గ్రాముల) బంగారం ధర రూ.10 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.45,930కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,620కి జంప్ అయింది. బంగారం ధరలు గత 10 రోజుల గరిష్ట ధరలు నమోదుచేయడం గమనార్హం. Photos: కబాలి బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు


నేడు ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలోనూ బంగారం ధర రూ.10 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,030కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.43,120 వద్ద ట్రేడ్ అవుతోంది. నిత్యావసర వస్తువుగా మద్యం.. ఈ కారణాలు తెలుసా?


వెండి ధర వరుసగా నాలుగోరోజూ అతి స్వల్పంగా పెరిగింది. నేటి మార్కెట్‌లో 1కేజీ వెండి ధర సైతం రూ.10 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.42,600కి చేరుకుంది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos