Tomato price hiked by RS 40 per kg in Vijayanagaram: సామాన్య, మధ్యతరగతి కుటుంబాల వంట గదిలో టమోటదే రాజ్యం. అందుకు కారణం లేకపోలేదు.. కూర, రసం, చట్నీ ఇలా రకరకాలుగా టమోటను ఉపయోగిస్తారు. అంతేకాదు ప్రతి వంటలోనూ టమోట ఉంటే.. ఆ రుచే వేరు. ఇక బయటకు వెళ్లినా.. టమోట లేని వంటకం దాదాపుగా దొరకదు. అంతెందుకు సాస్‌ రూపంలో కూడా ప్రతి హోటల్లో మనకు దర్శనమిస్తూనే ఉంటుంది. ఈ టమోట పురాణం ఇప్పుడు ఎందుకు అంటే.. మొన్నటివరకు రూ.20 ఉండే కిలో టమోట ఇప్పుడు కొన్నిచోట్ల రూ.60కి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఎండాకాలం కావడంతో టమోట ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏపీలోని విజయనగరం జిల్లా లావేరు మార్కెట్ పరిసరాల్లో 10 రోజుల క్రితం కిలో టమోట ధర రూ. 20గా ఉండగా.. ప్రస్తుతం రూ. 60కి చేరింది. అంటే కిలో టమోట ధరపై ఏకంగా రూ. 40 పెరిగింది. దాంతో టమోటలను కొనాలంటే మధ్యతరగతి ప్రజలు జంకుతున్నారు. అత్యవసరం అనుకుంటే తప్ప జనాలు టమోట జోలికి పొవట్లేదు. 


మదనపల్లి మార్కెట్‌లోనూ టమోట ధరకు రొక్కలొచ్చాయి. వారం రోజల క్రితం కిలో టమోట ధర రూ. 30-35 ఉండగా.. రంజాన్‌  సమీపిస్తున్న తరుణంలో ఆదివారం కిలో టమోటా రూ.55 పలికింది. మరోవైపు తెలంగాణలో కూడా టమోట ధరలు భారీగానే పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్‌లో టమోటా ధర కేజీకి రూ. 30 నుంచి 40 వరకు నడుస్తోంది. ప్రస్తుతం మండు వేసవి కాబట్టి.. వేడికి పంట దిగుబడి తగ్గడంతో టమోటలకు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు రైతుల దగ్గర తక్కువ ధరకు కొని బహిరంగ మార్కెట్లలో ఎక్కువ ధరలకు విక్రయాలు చేస్తున్నారు. 


Also Read: Viral Video: వ్యాయామం చేసేందుకు ప్రయత్నించి జారిపడ్డ వ్యక్తి.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!


Also Read: Dhoni Fires On Bowler: చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్‌ ముఖేష్‌ చౌదరీపై ధోనీ ఆగ్రహం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook