Dhoni Fires On Bowler: మిస్టర్ కూల్ .. అంటేనే ఎవరో ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ మహేంద్రసింగ్ ధోనీ. ఆఫ్ ద ఫీల్డ్ లో.. ఆన్ ద ఫీల్డ్ లో ధోనీ ఎంత కూల్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. అలాంటి ధోనీ జట్టు సభ్యులపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా తక్కువ. మరి హైదరాబాద్ తో ఇటీవల జరిగిన మ్యాచ్ లో బౌలర్ ముఖేష్ చౌదరీపై ఎందుకు ఫైర్ అయ్యాడు.
మే ఒకటో తేదీన సస్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది హైదరాబాద్. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి వరకు పోరాడి ఓటమిపాలైంది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. చివరి బంతి వరకు క్రీజులో ఉన్న నికోలాస్ పూరన్.. చెన్నై జట్టుకు కాస్త వణుకు తెప్పించాడు. హైదరాబాద్ గెలవాలంటే చివరి ఓవర్లో 38 పరుగులు కావాలి. చివరి ఓవర్ లో ముఖేష్ చౌదరి.. వేసిన తొలి బంతిని పూరన్.. సిక్సుగా మలిచాడు. రెండో బాల్ కు ఫోర్ కొట్టి.. హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. మూడో బంతి డాట్ బాల్ గా ముగిసింది. ఆ తర్వాత బాల్ లెగ్ సైడ్ వైడ్ వేశాడు. దీంతో వికెట్ల వెనక కీపింగ్ చేస్తున్న ధోనీకి చిరెత్తుకొచ్చింది. ఒక్కసారిగా ముఖేష్ చౌదరిపై అసహనం వ్యక్తం చేశాడు. ఫీల్డింగ్ సెట్ చేసింది ఆఫ్ సైడ్ అయితే.. నువ్వు లెగ్ సైడ్ ఎందుకు బౌలింగ్ చేస్తున్నావంటూ ఫైరయ్యాడు. ఆ తర్వాత మూడు బంతుల్లో పూరన్ రెండు సిక్సులు, ఒక సింగల్ తీశాడు. అయినప్పటికీ హైదరాబాద్ జట్టు మాత్రం విజయం సాధించలేకపోయింది. అయితే ధోనీ వరల్డ్ కప్ ఫైనల్ లాంటి మ్యాచుల్లోనూ ఎప్పుడూ ఇలా ఫ్రస్టేషన్ కు గురికాలేదు. అలాంటిది ప్రీమియర్ లీగ్ లో ధోనీ అంతలా ఆగ్రహం ఎందుకు తెచ్చుకున్నాడా అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
MS angry at Mukesh in the final over! I mean who wouldn’t be😃🙏#CSKvSRH #IPL2022 pic.twitter.com/RGShsHcs9O
— Navya #WhistlePodu #AavaDe (exam era) (@SweptForASix) May 1, 2022
అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో ఎనిమిదింటికి రవీంద్ర జడేడా కెప్టెన్సీ చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నుంచి మాత్రం ధోనీయే తిరిగి బాధ్యతలు తీసుకున్నాడు. ఈ మ్యాచులో ధోనీ మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగినప్పటికీ పెద్దగా ఆడింది లేదు. కేవలం ఎనిమిది పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ లో 13 పరుగుల తేడాతో గెలిచిన చెన్నై.. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.
Also Read: Nagarjuna Look: అరరే.. నాగార్జునకు ఏమైంది! కింగ్ అలా మారిపోయాడేంటి?
Also Read: Yadadri Temple: లాంగ్ లీవ్‌లో యాదాద్రి ఈవో గీతారెడ్డి... ఇంచార్జ్ ఈవోగా రామకృష్ణ నియామకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.