Tomato Price hike: టమాటా ధరలు సామాన్యుడికి కునుకు లేకుండా చేస్తున్నాయి. టమాటా రేటు కాస్త దిగొచ్చిందనుకునే లోపే మళ్లీ టమాటా ధర ఎగబాకింది. ఈసారి వర్షాల కారణంగా ధరలు రికార్డు స్థాయికి చేరాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో కిలో టమాటా ధర (Tomato Price hike) రూ. 200 పలికింది. ఈ సీజన్‌లో సాగు తక్కువగా ఉండటం, భారీ వర్షాలతో పంట దెబ్బతినడం టమాటా కొరత ఏర్పడి.. ధరలు భారీగా పెరిగాయి. మళ్లీ ఇదే స్థాయిలో ధరలు పెరిగితే తమ పరిస్థితి ఏంటని సామాన్యుడు వాపోతున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెలరోజులుగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ధరలు తగ్గేలోపు పెరుగుతున్నాయి. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్ చెన్నైలోని కోయంబేడులో ఉంది. ఇక్కడ కూడా టమాటాల దిగుమతి తగ్గడంతో.. రిటైల్ మార్కెట్లో టమాటా ధరల మోత మోగిపోతుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు టమాటా మార్కెట్ కు రావడం లేదని వ్యాపారులు అంటున్నారు. కోయంబేడు మార్కెట్ కు డైలీ 800 టన్నుల టమాటా లోడ్ రావాల్సి ఉండగా.. ఇప్పుడు అది 250 టన్నులకు పడిపోయింది. 


దిగువ, మధ్యతరగతి ప్రజలు టమాటాల వినియోగం తగ్గించేశారు. తమిళనాడు ప్రభుత్వం పీడీఎస్ దుకాణాల ద్వారా కిలో 60 రూపాయలకు విక్రయించడం ప్రారంభించింది. అధిక ధరలకు టమాటా కొనుగోలు చేయలేని వారు ఈ పబ్లిక్ మార్కెట్ల్ పైనే ఆధారపడుతున్నారు. రాబోయే రోజుల్లో టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సామాన్యులు భయపడుతున్నారు. ఒకప్పుడు రేటు లేక టమాటాలను రైతులు రోడ్లమీద పారబోసి వెళ్లిపోయేవారు. ఇప్పుడు అదే టమాటా వారికి సిరులు కురిపిస్తోంది. మహారాష్ట్రలో పలువురు టమాటా సాగుచేసే రైతులు వీటి అమ్మకాల ద్వారా లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారుతున్నారు.


Also Read: Tomato Price: ఆన్‌లైన్‌లో రూ.70కే కిలో టమాటా.. ఎక్కడంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి