Tomato Price: ఆన్‌లైన్‌లో రూ.70కే కిలో టమాటా.. ఎక్కడంటే..?

Tomatoes On ONDC: ఆన్‌లైన్‌లో కిలో రూ.70కే లభిస్తోంది. ఓఎన్‌డీసీలో సబ్సిడీ ధరలో టమాటాలోను విక్రయిస్తోంది ఎన్‌సీసీఎఫ్‌. అయితే అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేవు. కేవలం ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రజలకు మాత్రమే ఈ సబ్సిటీ టమాటాలు లభించనున్నాయి.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 25, 2023, 09:10 AM IST
Tomato Price: ఆన్‌లైన్‌లో రూ.70కే కిలో టమాటా.. ఎక్కడంటే..?

Tomatoes On ONDC: ఏ కూర అయినా రుచిగా ఉండాలంటే.. అందులో ఒక టమాటా అయినా పడాల్సిందే. అప్పుడే కాస్త నాలుకకు టెస్టీగా ఉంటుంది. కూరగాయల్లో రారాజుగా ఉన్న టమాటా ధరలు ఎప్పుడో కొండెక్కి కూర్చుకున్నాయి. భారీగా పెరిగిన టమాటా ధరలు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో సామాన్యులు కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. సెంచరీ దాటేసి డబులు సెంచరీ కొట్టిన టమాటా.. చికెన్ రేట్లను ఎప్పుడో దాటేసింది. వర్షాభావ పరిస్థితుల ప్రభావం కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో టమాట పంట ఉత్పత్తి సరిగా లేకపోవడంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించిది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ప్రజలకు 70 రూపాయలకే కేజీ టమాటా కొనుగోలు చేయవచ్చు.  ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) ద్వారా సబ్సిడీ కింద టమోటాలను ఆర్డర్ చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ కంపెనీ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌సీసీఎఫ్‌) ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో టమోటాల విక్రయం కోసం ఓఎన్‌డీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. 

వినియోగదారులు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య ఆర్డర్ చేస్తే.. మరుసటి రోజు డెలివరీ చేయయనున్నారు. ఎన్‌సీసీఎఫ్‌ ఎండీ అనిస్ జోసెఫ్ చంద్ర మాట్లాడుతూ.. వినియోగదారులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా డోర్‌స్టెప్ డెలివరీ ఉంటుందన్నారు. పేటీఎం, Magicpin, Mystore, Pincode వంటి యాప్ ద్వారా ఓఎన్‌డీసీలో టమాటాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వినియోగదారులు ఈ యాప్‌లలోకి కిలో టమాటా కేవలం రూ.70కే ఆర్డర్ చేయవచ్చన్నారు. అయితే ఒకసారి ఆర్డర్‌కు 2 కిలోల వరకు మాత్రమే పరిమితం ఉంటుందన్నారు. ఈ-కామర్స్ కంపెనీలు కిలోకు రూ.170-180 చొప్పున డోర్‌స్టెప్ డెలివరీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఓఎన్‌డీసీ డిసెంబర్ 31 2021న ప్రారంభించారు. ఇది ప్రస్తుత ప్లాట్‌ఫారమ్ సెంట్రిక్ డిజిటల్ కామర్స్ మోడల్‌ను మించిపోయింది. ఇక్కడ కొనుగోలుదారు, విక్రేత వ్యాపార లావాదేవీని ఒకే యాప్‌ను వినియోగించాలి.  నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) ద్వారా ఎన్‌సీసీఎఫ్ టమాటాలను సేకరిస్తోంది. మొదట కిలో రూ.90కు విక్రయించగా.. తరువాత రూ.80కి తగ్గించి.. ఇప్పుడు రూ.70కే విక్రయిస్తోంది. 

Also Read: Schools Colleges Bandh Today: రాష్ట్రంలో నేడు స్కూల్స్, కాలేజీలు బంద్.. కారణం ఇదే..!  

Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News