Trade Unions Strike: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్త సమ్మె జరగనుంది. వివిధ రంగాలకు చెందిన 20 కోట్లమంది కార్మికులు సమ్మెల్యో పాల్గొనవచ్చని అంచనా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దేశంలో వరుసగా ప్రభుత్వ ఆస్థుల్ని ప్రైవేట్ పరం చేస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలనేది ప్రధాన డిమాండ్‌గా ఉంది. మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్, సీఎన్ జీ ధరల్ని ఒకేసారిగా పెంచేశారని మండిపడుతున్నాయి. ఈపీఎఫ్ వడ్డీ రేటును కూడా 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించేశారు. 


దేశవ్యాప్తంగా ఇవాళ జరగనున్న కార్మికుల సమ్మెలో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకూ వివిధ రంగాల్లో కార్మికులు పాల్గొననున్నారు. సమ్మెలో రవాణా, బ్యాకింగ్, రైల్వే, విద్యుత్, కోల్, స్టీల్, ఆయిల్, టెలికాం, పోస్టల్, ఇన్‌కమ్ ట్యాక్స్, కాపర్, ఇన్సూరెన్స్ రంగాలు సమ్మెకు నోటీసిచ్చారు. సంఘాల ఫోరంలోని ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ జాతీయ యూనియన్లు, రాష్ట్రాల్లోని వివిధ సంఘాలు పాల్గొంటున్నాయి.


Also read: Video: గుండెలు పిండేసే వీడియో.. కూతురి శవాన్ని భుజాలపై 10కి.మీ మోసుకెళ్లిన తండ్రి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook