న్యూఢిల్లీ: కేబుల్‌ టీవీ, డీటీహెచ్‌ (DTH) సబ్‌స్క్రైబర్స్‌కి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRA)) గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై కేబుల్‌ టీవీ, డీటీహెచ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు తమ వినియోగదారులకు కనెక్షన్ తీసుకునే సమయంలో ఇచ్చే సెట్‌టాప్‌ బాక్సులు తప్పనిసరిగా ఇంటరాపరబిలిటీ సపోర్ట్‌ (interoperability support) వ్యవస్థను కలిగి ఉండాలని ట్రాయ్‌ సిఫారసు చేసింది. సెట్‌టాప్‌ బాక్సుల్లో తప్పనిసరిగా ఇంటరాపరబిలిటీ వ్యవస్థ కలిగి ఉండేలా ఆయా వాణిజ్య సంస్థలకు అనుమతులు, రిజిస్ట్రేషన్, లైసెన్స్ మంజూరు, రెన్యువల్ చేసే సమయంలోనే తప్పనిసరి నిబంధనలను సైతం తీసుకురావాలని ట్రాయ్‌ శనివారం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Coronavirus deaths: 24 గంటల్లోనే 2,108 మంది మృతి


ఇంటరాపరబిలిటీ సపోర్ట్‌ అంటే..
ఇప్పటివరకు కేబుల్ టీవీ, డీటీహెచ్ వినియోగదారులు ఒకదాని నుంచి మరొకదానికి కనెక్షన్ మార్చుకునే ప్రతీసారి మరో కొత్త సెట్‌టాప్‌ బాక్సును కొనుగోలు చేయాల్సి వస్తోంది. అందుకు కారణం ఆ సెట్ టాప్ బాక్సులలో నాన్-ఇంటరాపరబిలిటీ వ్యవస్థ లేకపోవడమే. ఒకవేళ ఇంటరాపరబిలిటీ సపోర్ట్‌ ఉన్న సెట్ టాప్ బాక్సు కనుక ఉన్నట్టయితే.. వినియోగదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు మరో కొత్త సెటాప్ బాక్సు తీసుకోకుండానే కోరుకున్న నెట్‌వర్క్‌కి మారిపోవడానికి వీలుంటుంది. 


Also read : ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్.. డౌట్స్ క్లియర్ చేసిన సీఎం కేసీఆర్


ఇప్పటివరకు డీటీహెచ్‌, కేబుల్‌ టీవీ నెట్‌వర్క్ ప్రొవైడర్స్ అందరూ తమ వినియోగదారులకు నాన్‌-ఇంటరాపరబుల్‌ సెట్‌టాప్‌ బాక్సులనే అందిస్తుండటం వల్ల ఏదైనా కారణాల వల్ల వినియోగదారులు కనెక్షన్ మార్చుకున్న ప్రతీసారి కొత్త సర్వీస్ ప్రొవైడర్ వద్ద మరో కొత్త సెటాప్ బాక్సు తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆ సెటాప్ బాక్స్ కోసం వినియోగదారుడి జేబుకు చిల్లు పడక తప్పనిసరి పరిస్థితి ఉంది. పైగా పాత సెటాప్ బాక్స్ ఇక దేనికి ఉపయోగపడటం లేదు కూడా. ఫలితంగా కనెక్షన్ మార్చుకునే ప్రతీసారి వినియోగదారుడు రెండు విధాల నష్టపోవాల్సి వస్తోంది. ట్రాయ్ సిఫార్సుల మేరకు సర్వీస్ ప్రొవైడర్లు సెటాప్ బాక్సుని ఇంటరాపరబిలిటీ పరిజ్ఞానంతో అందించినట్టయితే.. వినియోగదారుడికి ఇక ఆ నష్టం, తలనొప్పి ఉండవు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..