Train Accident: మహారాష్ట్రలో రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఒకదానికొకటి ఎదురెదురై ఢీ కొన్నాయి. ప్రమాదంలో ప్రాణనష్టంపై ఇంకా వివరాలు అందాల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహారాష్ట్రలోని దాదర్, మటుంగాల మధ్య ఒకే ట్రాక్‌పై ఛేంజింగ్ సమయంలో రెండు రైళ్లు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. గదగ్ ఎక్స్‌ప్రెస్, పుదుచేరి ఎక్స్‌ప్రెస్‌లు ట్రాక్ ఎక్స్చేంజ్ సమయంలో ఒకదానికొకటి ఎదురెదురై ఢీ కొన్నాయి. ఈ ఘటన దాదర్, మటుంగా రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. రెండు రైళ్లు ఢీ కొనడంతో హెడ్ వైర్ తెగిపోయి..భారీ పేలుడు శబ్దం విన్పించింది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు రైళ్లు తక్కువ వేగంతోనే ఉన్నాయి. ఈ కారణంగా ప్రాణనష్టానికి సంబంధించి ఏ విధమైన సమాచారం ఇంకా అందలేదు. రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొట్టడంతో కొన్ని కోచ్‌లు పట్టాలు తప్పాయి.


లోకల్ రైళ్లపై ప్రభావం


ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఈ రైలు ప్రమాదం నిన్న అంటే శుక్రవారం రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదం మటుంగా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగినట్టు రైల్వే అధికారుల వెల్లడించారు. ఈ ప్రమాదం కారణంగా స్థానిక రైళ్ల రాకపోకలపై ప్రభావం పడుతోంది.


Also read: Monkey Reached Old Sick Woman Home: అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలిని పరామర్శించిన వానరం.. నెటిజన్లు ఫిదా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook