Monkey Visited Old Woman Home: మానవులు నిత్యం ఏదో ఒక ఒత్తిడికి గురవుతూనే ఉంటారు. ఆ ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వడానికి ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు ఎంతో సహకరిస్తాయి. అయితే జంతువులు మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి మానవులకు జంతువులకు మధ్య మంచి సంబంధం నెలకొని ఉంది. మానవులతో మంచి సంబంధం ఉన్న జంతువులలో కోతి ఒకటి. మానవునికి కొతికి మధ్య మంచి సంబంధం ఉండడంతో కోతిని అందరు దేవుడిగా భావిస్తారు. అంతేకాకుండా కోతిని రకరకాల పేర్లతో పిలుస్తారు. కోతికి మనుషులకు దగ్గరి సంబంధం ఉండడంతో మానుషులకు ఉండే ప్రేమే కోతికి సగం ఉంటుందని భావిస్తారు.
ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో ఓ కోతి వీడియో చక్కర్లు కొడుతోంది. ఇటివలే ఓ కోతి అన్యారోగ్యం ఉన్న వృద్ధురాలిపై చూపించిన ప్రేమ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. కోతి ఏకంగా ఆ వృద్ధురాలి ఇంటికి వెళ్లి పలకరించింది. దీన్ని బట్టి చూస్తే కోతికి ఆ వృద్ధురాలి మధ్య ఉన్న ప్రేమ అంతో ఇంతో కాదనిపిస్తుంది. ఆ వృద్ధురాలు ఆనారోగ్యంగా ఉందని గ్రహించి ఆమెపై చూపించి ప్రేమను చూసి అందరు ఆశ్చర్యతున్నారు. ఈ సన్నివేశాలు చూసేవారికి ఒక విషయం తెలిసోచ్చింది. మనుషులు జంతువులపై తమ ప్రేమను చూపిస్తే జంతువులు కూడా అంతే ప్రేమను చూపిస్తాయని ప్రస్తుతం ఈ కోతి చేసిన పనికి తెలిసోచ్చింది.
వృద్ధురాలు నిత్యం కోతులకు ఏదో ఒక పండునిగాని, తిండి పదార్థలను ఆహారంగా వేస్తుండేది. అయితే ఆ వృద్ధురాలు గత రెండు రోజులగా అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో ఆ కోతికి ఆహారం అందించలేక పోయింది వృద్ధురాలు. అయితే కోతే ఎకంగా వృద్ధురాలి ఇంటికి వెళ్లింది. ఆ వృద్ధురాలు అనారోగ్యంతో ఉండడాన్ని గమనించిన కోతి యోగక్షేమాలు తెలుసుకుంది. ఈ కోతి చూపించిన యోగక్షేమాలు గమనించిన కుటుంబ సభ్యులు.. ఆ సన్నివేశాలను ఫోన్‌లో చిత్రికరించారు. ఈ వీడియో కలెక్టర్ దాకా చేరడంతో తన ట్విటర్ ఖాతలో ఆ వీడియోని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈ వీడియోని చూసిన వారంతా కోతిని ప్రశంశింస్తున్నారు.
Also Read:పెళ్లిలో బిగ్ ట్విస్ట్... ఆపాలంటూ ప్రియురాలి గొడవ... జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన వరుడి బంధువులు...
Also Read:Joe Root Captaincy: కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన జో రూట్.. అసలు కారణం అదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook