దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూకుష్ ప్రాంతంలో సంభవించిన భూకంపమే దీనికి కారణం అని తెలుస్తోంది. ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంలో మధ్యాహం 12.42 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. భూ ప్రకంపనలు పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్లతో పాటు ఉత్తరప్రదేశ్ కు కూడా వ్యాపించాయి. ఒక్కసారి భూప్రకంపనలు రావడంతో దేశ రాజధానిలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యాయి. అయితే ఈ ప్రకంపనల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఓ అధికారి వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూకుష్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు, దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదైందని యూరప్-మధ్యధరా భూకంప కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. భూకంప ప్రభావం జమ్ములో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.