కాంగ్రెస్ నేతలకు ప్రధాని మోడీ ఆత్మీయ పలకరింపు
పార్లమెంట్ ఆవరణలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది.
బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అలాంటిది..వారు ఒకే వేదికపైకి చేరితే ఆ ఘర్షణ ఎలా ఉంటుందో ఊహించలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే అందుకు భిన్నంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటే ఎలా ఉంటుంది. ఇదెలా సాధ్యమని మీరు అనుకుంటున్నారా ?..అయితే దీన్ని నమ్మి తీరాల్సిందే. సరిగ్గా 16 ఏళ్ల క్రితం భారత పార్లమెంట్ దాడిలో 9 మంది సైనికులు అసువులు బాసిన విషయం తెలిసిందే. బుధవారం వారికి నివాళులు అర్పించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇలాంటి అరుదైన ఘట్టానికి వేదికైంది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సహా పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ప్రధాని మోడీతో కరచాలనం చేసుకొని అప్యాయంగా పలకరించారు. అలాగే రాహుల్ గాంధీని కేంద్ర మంత్రులు సుష్మ, మణిశంకర్ ప్రసాద్‌లు అప్యాయంగా పలకరించారు. పరస్పరం మట్లాడుకుంటూ నవ్వులు చిందించారు. ఇలాంటి దృశ్యాలు పార్లమెంట్ ఆవరణలో ఆవిష్కృతమయ్యాయి.
2001లో భారత పార్లమెంటుపై జరిగిన దాడిలో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఆవరణలో బుధవారం ఉగ్రదాడి మృతులకు నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు.