Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. త్వరలో డిఏ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. డీఏ సహా మూడు కీలకమైన అంశాలపై కేంద్రం జూలై నెలలో నిర్ణయం తీసుకోనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గుడ్‌న్యూస్. త్వరలోనే అంటే జూలై నెలలో కేంద్రం మూడు కీలక విషయాలపై నిర్ణయం తీసుకోనుంది. డీఏ 5 శాతం పెంపు, 18 నెలల ఎరియర్స్, పీఎఫ్ వడ్డీ రేటు జమ చేయడంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.  7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జూలై నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ త్రిపుల్ బొనాంజా తగలనుంది. 


జూలై నెల నుంచి డీఏ 5 శాతం పెరగవచ్చని ఆల్ ఇండియా సీపీఐ ఐడబ్ల్యూ డేటా చెబుతోంది. డీఏ పెంపు నిర్ణయం కోసం లక్షలాదిమంది ఉద్యోగులు ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. ఏప్రిల్ నెల ఏఐసీపీ ఇండెక్స్ ప్రకారం జూలై నెల నుంచి డీఏ పెరగవచ్చు. జూలై నెలలోనే ప్రభుత్వం ఉద్యోగులకు మరికొన్ని శుభవార్తలు విన్పించనుంది. డీఏ 5 శాతం పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 39 శాతానికి చేరుకోనుంది. వాస్తవానికి డీఏ 4 శాతం పెంచవచ్చని భావించారు. 


మరోవైపు 18 నెలల పెండింగ్ డీఏ కూడా జూలై నెలలోనే చెల్లించవచ్చని తెలుస్తోంది. 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకూ అంటే 18 నెలల డీఏను చెల్లించనుంది. ఇది అమలైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏ రూపంలో దాదాపున రెండేసి లక్షల రూపాయలు వస్తాయి. మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ ఏడాది ఈపీఎఫ్ వడ్డీను 8.1 శాతంగా ప్రకటించింది. 2021-22 ఏడాదికి ఈ వడ్డీ వర్తించనుంది. పీఎఫ్ పై వడ్డీ డబ్బులు కూడా జూలై నెలలోనే పడే అవకాశాలున్నాయి.


Also read: Congress MP Jyotimani: నా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.. మహిళా ఎంపీ ఆరోపణలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook