కోటి ఆశలతో ఈశాన్య కురుక్షేత్రంలో అడుగుపెట్టిన బీజేపీకి త్రిపుర ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ బ్రహ్మాండమైన విజయం సాధించింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే  మొత్తం 59 స్థానాలకు గాను బీజేపీ కూటమి 43 సీట్లు గెలుచుకుంది. కమ్యూనిస్టు కంచుకోటగా పేరున్న త్రిపురలో వామపక్ష పార్టీలు 16 స్థానాలు మాత్రమే నిలబెట్టుకోగలిగాయి. ఫలితంగా అధికారం పక్షం నుంచి ప్రతిపక్ష పాత్రకు సీపీఎం సిద్ధమైంది. గత 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న కమ్యూనిస్టులను ఓడించి కమలం పార్టీ విజయదుందుభి మోగించడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబారాల్లో మునిగి తేలుతున్నారు..కాగా కోటి ఆశలతో ఈశాన్య కురుక్షేత్రంలో అడుగుపెట్టిన కాంగ్రెస్‌కు ఒక్కసీటు కూడా దక్కకపోవడం గమనార్హం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తం స్థానాలు  - 59


బీజేపీ కూటమి - 43


వామపక్షాలు (సీపీఎం) - 17


కాంగ్రెస్ - 0