Purchased Land On Moon: చంద్రుడిపై భూమి కొనేశాడు.. చౌక భేరం.. ఎకరం 6 వేలకే!
Purchased Land on Moon: భూమి కంటే చంద్రుడిపై రియల్ ఎస్టేట్ ధరలు చౌకగానే ఉన్నట్లుంది. త్రిపురకు చెందిన ఓ వ్యక్తి కేవలం రూ.6వేలకే చంద్రుడిపై ఎకరా భూమిని కొనుగోలు చేశాడు.
Purchased Land on Moon: చూస్తుంటే చంద్రుడిపై కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ జోరుగానే జరుగుతున్నట్లుంది. తాజాగా త్రిపురకు చెందిన ఓ వ్యక్తి చంద్రుడిపై రూ.6 వేలకు ఎకరా భూమిని కొనుగోలు చేశాడు. ఏంటి రూ.6 వేలకే ఎకరం భూమా.. అనిపించవచ్చు. కానీ ఇది నిజమే. ఇంటర్నేషనల్ లూనార్ సొసైటీ అనే సంస్థకు ఆ మొత్తాన్ని చెల్లించడం ద్వారా సుమన్ దేవ్‌నాథ్ అనే వ్యక్తి ఎకరా భూమిని కొనుగోలు చేసినట్లు నార్త్ ఈస్ట్ టుడే మీడియా సంస్థ ఒక కథనంలో వెల్లడించింది.
చంద్రుడిపై భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా తనకు మెయిల్ ద్వారా అందినట్లు సుమన్ దేవనాథ్ తెలిపారు. ఇందులో ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ (ILLR), న్యూయార్క్ డాక్యుమెంట్ కూడా ఉన్నట్లు తెలిపారు. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు చంద్రుడిపై భూమి కొనుగోలు చేసినట్లు తెలిసి.. తనకు అక్కడ భూమి కొనుగోలు చేయాలనే ఆసక్తి కలిగిందన్నారు. చంద్రుడిపై కొనుగోలు చేసిన భూమిని తనకు తాను గిఫ్ట్‌గా ఇచ్చుకున్నట్లు తెలిపారు.
ఇందుకోసం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయగా కొంత సమాచారం లభించిందన్నారు. ఆ సమాచారంతోనే ఐఐఎల్ఆర్ ద్వారా భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. చంద్రుడిపై అతను కొనుగోలు చేసిన ల్యాండ్ మేర్ నుబియం ప్రాంతంగా చెబుతున్నారు. కాగా, చంద్రుడిపై భూమి కొనుగోలు చేసిన మొదటి బాలీవుడ్ స్టార్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. చంద్రుడిపై మేర్ ముస్కోవియన్స్ ప్రాంతంలో అతను భూమిని కొనుగోలు చేశాడు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్‌కి కూడా చంద్రుడిపై భూమి ఉంది. గతంలో అతని అభిమాని ఒకరు షారుఖ్ అది గిఫ్ట్‌గా ఇచ్చారు.
Also Read: Russia Ukraine Conflict: ఇండియాపై కూడా ఆ ప్రభావం.. ఇంధన ధరలు భారీగా పెరిగే ఛాన్స్!
Also Read: RJ Rachana: పాపులర్ రేడియో జాకీ రచన హఠాన్మరణం.. పునీత్ లాగే చిన్న వయసులో గుండెపోటుతో మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook