ఛత్తీస్‌గఢ్ అనగానే మొదటగా గుర్తొచ్చేది మావోయిస్టులు, ఎన్‌కౌంటర్. ఆ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం అంతగా ఉంది. ఇటీవల దాదాపు నెలరోజుల కిందట సైతం భారీ ఎన్‌కౌంటర్ జరగడం తెలిసిందే. బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది జవాన్లు మరణించారని అధికారికంగా వెల్లడించారు. మరికొందరి ఆచూకీ లభ్యం కాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మావోయిస్టుల కదలికలపై తాజాగా సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది కూంబింగ్ మొదలుపెట్టారు. సుక్మా జిల్లాలో అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతకు యత్నిస్తుండగా, ఓ చోట 5 కేజీల ఐఈడీని గుర్తించారు. కోబ్రా బెటాలియన్‌కు చెందిన భద్రతా సిబ్బంది ఆ భారీ ఐఈడీని నిర్వీర్యం చేశారు. ఆ ప్రాంతంలో మరిన్ని చోట్ల ఒకేసారి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) ప్రభుత్వం సైతం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతోంది.



కాగా, ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. గాయాపాలైన జవాన్లకు బీజాపూర్, రాయ్‌పూర్ జిల్లా ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. దాదాపు 20 మంది వరకు భద్రతా సిబ్బంది ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు అడవిలో అన్వేషించడం తెలిసిందే. భద్రతా సిబ్బంది వారి స్థావరాలకు చేరుకోగానే మావోయిస్టులు కాల్పుల (Chhattisgarh Encounter)కు తెబడుతున్నారు. దాంతో భద్రతా ప్రాణాలు కోల్పోతున్నారు.  


Also Read: India Corona Cases: కరోనా వ్యాక్సినేషన్‌లో మరో మైలురాయి, తాజాగా 2 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook