Manipur Violence: మరోసారి రెచ్చిపోయిన అల్లరిమూకలు.. ఏకంగా ఆయుధాల లూటీకి యత్నం.. ఒకరు మృతి..
Manipur Violence: మణిపూర్‌లో హింస ఆగడంలేదు. ఇవాళ తెల్లవారు జామున భారీగా కాల్పులు చోటు చేసుకొన్నాయి. నిన్న ఇండియన్ రిజర్వు బెటాలియన్ వద్ద ఉన్న ఆయుధాలను లూటీ చేసేందుకు అల్లరి మూకలు విఫలయత్నం చేశాయి.
Manipur Violence: మణిపూర్‌లో హింస చల్లారడం లేదు. తరచూ ఏదో ఒక చోట హింసాత్మక ఘటనలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటికే వంద మంది పైగా చనిపోయారు. తాజాగా రాష్ట్రంలోని ఇండియన్ రిజర్వు బెటాలియన్ వద్ద ఉన్న ఆయుధాలను లూటీ చేసేందుకు అల్లరి మూకలు ప్రయత్నించాయి. వీటిని భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ ఘర్షణల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ధౌబాల్ జిల్లాలో చోటు చేసుకొంది.
పక్కా ఫ్లాన్ తో వందల సంఖ్యలో అల్లరి మూకలు ఐఆర్‌బీ బెటాలియన్ పోస్టుపై దాడికి తెగబడ్డాయి. ఐఆర్‌బీ దళాలకు సపోర్టుగా సైన్యం, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇతర దళాలు రాకుండా అల్లరి మూకలు ముందుగానే రోడ్లను తవ్వేశాయి. కానీ సమయానికి అస్సాం రైఫిల్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు ఘటనా స్థలానికి చేరుకోవడంతో పెనుముప్పు తప్పింది. వీరి అల్లరి మూకలను చెదరగొట్టారు. ఈ ఘటనలో ఓ దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. మణిపుర్‌లోని చాలా పోస్టుల వద్ద ఇదే ఉద్రిక్త పరిస్థితి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 118 చెక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 326 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Chilli Price Hike: మంట పుట్టిస్తోన్న పచ్చి మిర్చి.. కిలో రూ.350.. ఇదే దారిలో అల్లం కూడా..!
ఈశాన్య రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట హింస చెలరేగుతూనే ఉంది. ఇవాళ అంటే బుధవారం తెల్లవారుజామున 4.30 సమయంలో తూర్పు ఫైలెంగ్ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ముందు రోజు రాత్రి ఖోయిజుంతాబి ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ రెండు ఘటనల్లో ప్రాణనష్టంపై ఎటువంటి సమాచారం లేదు.
Also Read: BJP New Presidents: బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం.. బండి సంజయ్, సోము వీర్రాజు అధ్యక్షులుగా తొలగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook