Chilli Price Hike: మంట పుట్టిస్తోన్న పచ్చి మిర్చి.. కిలో రూ.350.. ఇదే దారిలో అల్లం కూడా..!

Vegetable rates today: దేశంలో కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్నటి వరకు టమాటా, పప్పు దినుసులు, మసాల ధరలు పెరిగితే... ఇప్పుడు పచ్చి మిర్చి ధర ఆకాశాన్నింటింది. ఏకంగా 400 వందలకు చేరింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 4, 2023, 11:28 AM IST
Chilli Price Hike: మంట పుట్టిస్తోన్న పచ్చి మిర్చి.. కిలో రూ.350.. ఇదే దారిలో అల్లం కూడా..!

Chillie Price Hike: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా టమాటా, పచ్చి మిర్చి ధరలు ఆకాశాన్నింటుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ. 100 నుంచి 120 వరకు పలుకుతోంది. మన ఏపీలో అయితే టమాటాలను సబ్సిడీపై కిలో రూ. 50కు విక్రయిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమాటా రూ. 160 వరకు కూడా ఉంది. రేట్లు ఇలా ఉంటే ఇక కూర ఎలా వండుకోవాలని సామాన్య జనం గగ్గోలు పెడుతున్నారు. 

మరోవైపు పచ్చిమిర్చి టమాటాను మించి ఎగబాకుతుంది. మెున్నటి వరకు కిలో రూ. 160 ఉన్న పచ్చిమిర్చి ఇప్పుడు ఏకంగా 300-350 రూపాయలకు చేరింది. దీంతో ప్రజల గుండెల్లో రాయిపడినట్లయింది. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో రూ.100 ఉన్న పచ్చి మిర్చి ధర.. కోల్ కతా మార్కెట్లో మిర్చి ధర రికార్డు స్థాయిలో 350 రూపాయలకు చేరింది. మరోవైపు అల్లం రేటు కూడా ఇదే స్థాయిలో ఉంది.  త్వరలోనే పచ్చి మిర్చి మరియు అల్లం ధరలు 400 రూపాయలకు చేరే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మిర్చిని ఎక్కువగా సాగు చేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు ఈ ఏడాది ఇతర పంటలకు మల్లడంతో సప్లై తగ్గి ధరలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. 

పచ్చి మిర్చి ధరలు విపరీతంగా  పెరగడంతో చాలా మంది పచ్చి మిర్చిని వాడటం మానేశారు. హోటళ్లు, రెస్టారెంట్, హాస్టళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్లు తక్కువగా వాడుతున్నారు. మరోవైపు మసాలా దినుసుల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. బహిరంగ మార్కెట్లో కిలో జీలకర్ర రూ.750, కేజీ లవంగం ధర రూ. 1200 పలుకుతోంది. ధరలు పెరగడంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

Also Read: PM Narendra Modi: పీఎం మోదీ నివాసంపై డ్రోన్ కలకలం.. నో ఫ్లై జోన్‌లో ఎలా వచ్చింది..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

 

Trending News