Devotees have to wait 48 hours for Tirumala Sarva Darshan: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. వారాంతంలో వరుస సెలవులు, పెళ్లి ముహూర్తాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. స్వామివారి దర్శనానికి 48 గంటలకు పైగా సమయం పడుతోందని తితిదే అధికారులు ప్రకటించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భక్తుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేంకటేశ్వరస్వామి ధర్మ దర్శనానికి క్యూ లైన్‌లో వచ్చిన భక్తులు శనివారం (ఆగష్టు 13) సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయారు. నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్‌ రోడ్డులోని ఆక్టోపస్‌ బిల్డింగ్‌ వరకు భక్తులు వేచి ఉన్నారు.  వారాంతపు సెలవుల కారణంగా దాదాపు ఆరు కిలో మీటర్లకు పైగా క్యూ లైన్లు, రింగ్‌ రోడ్డులో భారీ రద్దీ నెలకొంది. దాంతో స్వామివారి దర్శనానికి 48 గంటలకుపైగా సమయం పడుతోంది.


శనివారం రాత్రి 8 గంటల వరకు 56,546 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర శ్రీవారిని దర్శించుకున్నారు. రద్దీ దృశ్యా ఆగష్టు 21 వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రద్దీ నేపథ్యంలో తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇక శుక్రవారం 64,079 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. రూ.3.52 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి. 


Also Read: బంగారం ప్రియులకు షాక్.. వరుసగా మూడో రోజు పెరిగిన పసిడి ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే  


Also Read: స్కూల్లో మంచినీళ్ల కుండను తాకినందుకు దళిత విద్యార్థిపై టీచర్‌ దాడి.. చికిత్స పొందుతూ బాధిత బాలుడి మృతి  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook