ఉత్తరాఖండ్‌ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హత్యకు కుట్ర జరిగింది. దీనికి సంబంధించి చాటింగ్ చేస్తూ ఇద్దరు యువకులు పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే.. ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్‌ జిల్లా ధర్చులాలో మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ఒక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తమ ప్రాంతానికి వస్తున్న నిర్మల చంపేద్దామని ఇద్దరు యువకులు ఫోన్ లో పిచ్చపాటిగా చాటింగ్ చేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ‘‘సీతారామన్‌ను నేను కాల్చిపారేస్తాను... రేపే ఆమె జీవితంలో ఆఖరి రోజు’’ అని వారు మెసేజ్‌ పంపించుకున్నారు. ఇది ఆనోటా.. ఈనోటా పాకి నిఘా వర్గాల చెవిన పడింది. అంతే నిమిషాల్లో పోలీసులు రంగప్రవేశం చేసి నిందితులను అరెస్టు చేశారు


మద్యం మత్తులో ఉండి వారు మంత్రి గురించి మాట్లాడుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ రామ్‌చంద్ర వెల్లడించారు. నిందితులు వాట్సాప్ సంభాషణ ఆదివారం రాత్రి 9:30 నిమిషాలకు చేసినట్లు వివరించారు.  వాట్సాప్ మెసేజ్ ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసి  జైలుకు తరలించారమన్నారు. ఐపీసీలోని 506, ఐటీ చట్టంలోని 66 సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రామ్‌చంద్ర వెల్లడించారు.