6th Class Students Became Billionaires: మీ ప్రమేయం లేకుండా, అకస్మాత్తుగా మీ అకౌంట్లో ఎంతో కొంత డబ్బు పడితే.. ఆ సంతోషానికి అవధులుండవు కదా..!! అదే మీ అకౌంట్లో అక్షరాల రూ. 900 కోట్లు పడితే.. భూమిపై ఉండగలరా.. ?? కానీ ఇలాంటి సంఘటనే బీహార్‌లోని కటిహార్‌లో గ్రామంలో జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉన్నట్టు ఉండి, కేటీహార్ జిల్లాలోని ( Katihar district) అజమ్‌నగర్ ( Azamnagar block)చెందిన గ్రామస్థులందరు... ఒక్కసారిగా బ్యాంక్ కు వెళ్లి తమ పిల్లల అకౌంట్లను చెక్ చేస్తున్నారు. విషయం తెలియని బ్యాంక్ అధికారులు ఇదేంటా అని ఆశ్చర్యపోతున్నారని. కానీ అదే ఊళ్లో 6 వ తరగతికి చెందిన ఆశిష్ (Ashish) మరియు గురుచరణ్ (Gurucharan) అకౌంట్లో జమ అయిన విధంగా డబ్బులు ఏమైనా వారి పిల్లల అకౌంట్లో చేరాయేమో అని చెక్ చేయటానికి వచ్చారని తెలిసుకున్నారు.  


Also Read: Saidabad Raju Case: ఎన్‌కౌంటర్ చేస్తామన్న 1 రోజు తరువాత నిందితుడి మృతదేహం.. రేకెత్తిస్తున్న పలు అనుమానాలు!


కటిహార్‌లోని అజమ్‌నగర్ బ్లాక్‌లోని పాస్టియా గ్రామంలో  6 వ తరగతి చదువుతున్న ఆశిష్, గురు చరణ్ విశ్వాస్ లకు ఉత్తర బీహార్ గ్రామీణ బ్యాంకుల్లో (North Bihar Gramin Bank) ఖాతాలు ఉన్నాయి. నిజానికి స్కూల్ దుస్తువుల సంబంధిత డబ్బులు వారి అకౌంట్లో జమ కావాల్సి ఉంది, అది చెక్ చేయటానికి వెళ్లిన వారికి షాక్ కొట్టినంత పనైంది. 


ఆశిష్ అకౌంట్లో 6 కోట్ల 20 లక్షల 11 వేల 100 వందల రూపాయలు (Rs.6,20,21,100) మరియు గురు చరణ్ విశ్వాస్ 900 కోట్ల రూపాయలకు పైగా  వచ్చిపడ్డాయి. అకస్మాత్తుగా వచ్చి పడ్డ డబ్బులను చూసి, అటు కుటంబ సభ్యులు, బ్యాంక్ యాజమాన్యం ఆశ్చర్యానికి గురవుతున్నారు. రాత్రికి రాత్రి ఆ పిల్లలు ఎలా కోటీశ్వరులయ్యరో వారికి కూడా అర్థం కాకా నోరేళ్ల బెట్టారు. 


Also Read: SBI Good News: తక్కువ వడ్డీకే లోన్.. ఎస్‌బీఐ పండుగ ఆఫర్లు.. త్వరపడండి!


ఆ బ్యాంక్ మేనేజర్ మనోజ్ గుప్తా (Bank Manager Manoj Gupta) మాట్లాడుతూ.. ఇద్దరు పిల్లల బ్యాంక్ అకౌంట్లు నిలిపివేయబడ్డాయి, ఈ విషయంపై బ్యాంక్ పై అధికారులకు తెలియచేశామని, ఈ విషయంపై దర్యప్తు జరుపుతున్నామని తెలిపారు.  


బీహార్‌లోని (Bihar) ఖగారియాలో (Khagaria) కూడా ఒక వ్యక్తికి ఇలాంటి సంఘటనే ఎదురైంది. రంజిత్ దాస్ అనే యువకుడి ఖాతాలో కూడా అకస్మాత్తుగా ఐదున్నర లక్షల రూపాయలు వచ్చిపడ్డాయి. అసలు విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి ఆ డబ్బులు ఖర్చు చేయటం... విషయం తెలిసిన తరువాత బ్యాంక్ యాజమాన్యం మొత్తం డబ్బు తిరిగి కట్టాలని అతడికి నోటీసులు కూడా జారీ చేసింది.  


దీనిపై రంజిత్ దాస్ (Ranjit Das) డబ్బు తిరిగి ఉవ్వనని, నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆ డబ్బు పంపారని తెలిపాడు. చేసేదేం లేక బ్యాంక్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించగా రంజిత్ దాస్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. 


Also Read: Sai Dharam Tej: అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్.. సాయి ధరమ్ తేజ్‏ను పరామర్శించిన బన్నీ.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook