Saidabad Raju Case: ఎన్‌కౌంటర్ చేస్తామన్న 1 రోజు తరువాత నిందితుడి మృతదేహం.. రేకెత్తిస్తున్న పలు అనుమానాలు!

బుధవారం తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి నిందితుడిని పట్టుకొని ఎన్‌కౌంటర్ చేస్తామని చెప్పిన 24 గంటల్లో మృతదేహం లభ్యం అవటం పలు అనుమానాలకు దారి తీస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2021, 03:09 PM IST
  • మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యల తరువాత బాడీ లభ్యం
  • సైదాబాద్ కేసులో రేకెత్తిస్తున్న అనుమానాలు
  • ఏదేమైనా తగిన శాస్త్రి జరిగిందన్న నెటిజన్లు
Saidabad Raju Case: ఎన్‌కౌంటర్ చేస్తామన్న 1 రోజు తరువాత నిందితుడి మృతదేహం.. రేకెత్తిస్తున్న పలు అనుమానాలు!

Saidabad Raju Case: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడి మృతదేహం వరంగల్ జిల్లాలోని రైల్వే ట్రాక్‌లో లభ్యమైంది. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి ఎన్‌కౌంటర్ గురించి సంచలన ప్రకటన చేసిన ఒక రోజు తర్వాత నిందితుడి మృతదేహం కనుగొనబడటం పలు అనుమానాలను కలిగిస్తుంది. 

తెలంగాణ డీజీపీ నిర్దారణ:
వరంగల్ జిల్లాలోని రైల్వే ట్రాక్‌లో దొరికిన మృతదేహం అత్యాచారం చేసి పారిపోయిన నిందితుడు రాజు దేనని, తెలంగాణ డిజిపి ధృవీకరించారు. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని గుర్తించామని తెలంగాణ డీజీపీ తెలిపారు.  అధికారిక డీజీపీ తెలంగాణ పోలీస్ ట్విట్టర్ ఖాతాలో "సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడి మృతదేహం ఘనపూర్ రైల్వే ట్రాక్‌లో కనుగొనబడింది. మృతదేహంపై ఉన్న గుర్తుల ఆధారంగా నిందితుడిని నిర్ధారించాం" అని పోస్ట్ చేస్తూ చేసారు. 

Also Read: EPF Account: మీకు పీఎఫ్ ఎక్కౌంట్ ఉందా..ఈ దరఖాస్తు సమర్పిస్తే 7 లక్షల వరకూ ప్రయోజనం

ఎన్‌కౌంటర్ గురించి మంత్రి వ్యాఖ్యలు:
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి బుధవారం మాట్లాడుతూ, ' ఖచ్చితంగా అతడిని అరెస్టు చేస్తాము మరియు ఎన్‌కౌంటర్ చేస్తాము.' "మంత్రి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఇలాంటి భయంకర ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఇలాంటి వారిని ఎన్‌కౌంటర్ చేయాలి. ఎట్టి పరిస్థితిలో ఇలాంటి మృగాలను వదిలే ప్రసక్తి లేదని" ఆయన పేర్కొన్నారు. 

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన సరిగ్గా 24 గంటలలో నిందితుడి మృతదేహం లభ్యం అవటం కొంత మందిలో అనుమానాలను రేకెత్తిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఘటన పట్ల బాధవ్యక్తం చేసిన ప్రతి ఒక్కరు సరైన శాస్తి జరిగిందని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. 

Also Read: Ap High Court Green Signal: ఏపీలో తొలగిన ఉత్కంఠత, పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు గ్రీన్ సిగ్నల్

అర్ద్ర నగ్న స్థితిలో బాలిక శవం:
సెప్టెంబర్ 9 న, హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ ప్రాంతంలోని సింగరేణి మురికివాడ కాలనీలో అర్ద్ర నగ్న స్థితిలో ఉన్న ఆరేళ్ల బాలిక పొరుగింట్లో శవమై కనిపించింది. పోస్ట్ మార్టం వివరాల ప్రకారం బాలికపై లైంగిక వేధింపులు జరుగాయని, నోట్లో నుండి శబ్దం రాకుండా గొంతు నులిమి చంపినట్లు తేలింది. పక్క ఇంట్లో ఉంటున్న రాజు అనే ప్రధాన అనుమానితుడని తెలిపారు. 

10 లక్షల రివార్డును ప్రకటించిన పోలీసులు:
ఆరేళ్ల పాపపైన అత్యాచారం చేసిన పి.రాజు గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తికి హైదరాబాద్ పోలీసులు 10 లక్షల రూపాయల రివార్డు ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. నిందితుడి ఫోటోను విడుదల చేస్తున్నప్పుడు, అనుమానితుడు సుమారు 5 అడుగుల 9 అంగుళాల పొడవు మరియు అతని చేతులపై 'మౌనిక' పచ్చబొట్టు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Also Read: Zoom App: జూమ్‌లో అద్భుతమైన కొత్త ఫీచర్‌ ..12 భాషల్లో లైవ్ ట్రాన్స్‌లేషన్‌! ఎలాగో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

More Stories

Trending News