కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఇంకెంతో దూరంలో లేదు. 3 విదేశీ కంపెనీ వ్యాక్సిన్‌లు డిసెంబర్ నాటికి అందుబాటులో రానుండగా..దేశీయంగా తయారైన రెండు వ్యాక్సిన్‌లు సైతం అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ వ్యాక్సిన్ ( Coronavirus vaccine )‌పై అంతర్జాతీయంగా ఇప్పుడు సానుకూల ఫలితాలు వస్తున్నాయి. అదే సమయంలో ఇండియా నుంచి కూడా సానుకూల ప్రకటన వెలువడుతోంది. నీతి ఆయోగ్ ( Niti aayog ) సభ్యుడు, వ్యాక్సిన్ పంపిణీపై ప్రధాని సలహా ప్యానెల్ అధిపతి డాక్టర్ వినోద్ పాల్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దేశీయంగా 5 కరోనా వ్యాక్సిన్‌లు వివిధ దశల ప్రయోగాల్లో ఉన్నాయని..వీటిలో రెండు వ్యాక్సిన్‌లు అడ్వాన్స్ దశకు చేరుకున్నాయని డాక్టర్ వినోద్ పాల్ స్పష్టం చేశారు. ముఖ్యంగా భారత్ బయోటెక్ ( Bharat Biotech )‌కు చెందిన కోవ్యాగ్జిన్ ( Covaxin ) ఇప్పటికే మూడవ దశ ప్రయోగాల్ని ప్రారంభించిందని చెప్పారు. 


ఇండియాలో ప్రస్తుతం 5 వ్యాక్సిన్లు వివిధ దశల ట్రయల్స్‌లో ఉన్నాయని పాల్‌  తెలిపారు. ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా ( AstraZeneca ) ఫేజ్-3 అధునాతన దశలో ఉందన్నారు. అలాగే   కాడిలా వ్యాక్సిన్ , రష్యాకు చెందిన  స్పుత్నిక్ వి ( Sputnik v ) ట్రయల్ ఫేజ్-2  ప్రిపరేషన్ పూర్తయిందని చెప్పారు. దీంతోపాటు జైడస్ కాడిలా రూపొందించిన జైకోవ్-డి దేశంలో రెండవ దశ క్లినికల్ ట్రయల్‌లో ఉందని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన మరో వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఇటీవల దేశంలో మూడవ దశ క్లినికల్ ట్రయల్‌ను ప్రారంభించింది. అదే విధంగా డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ త్వరలో రష్యన్ కోవిడ్‌-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వి రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనుంది.


ప్రంట్‌లైన్ కార్మికులకే ముందుగా వ్యాక్సిన్ ఇస్తామని డాక్టర్ పాల్ చెప్పారు. మరణాల్ని తగ్గించడం, ప్రంట్‌లైన్ కార్మికుల రక్షణకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇందులో భాగంగా 30 కోట్ల తొలి ప్రాధాన్యత లబ్దిదారుల్ని గుర్తించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. Also read: Lockdown: ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ ?