కరోనా వైరస్. . . ఈ పేరు వింటేనే .. గుండెల్లో నుంచి వణుకు పుడుతోంది. 10 రోజుల క్రితం చైనాలో కనిపించిన ఈ వైరస్ .. ఇప్పుడు ప్రపంచాన్ని గడగడా వణికిస్తోంది. ఎంతలా పరిస్థితి దిగజారిందంటే . .  కరోనా వైరస్ పేరు వింటనే వెన్నులో నుంచి వణుకు వస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ దెబ్బకు చైనాలో దాదాపు 243 మంది చనిపోయారు. ఆర్ధికంగా పరిపుష్టిగా ఉన్న చైనానే ఈ వైరస్ చిగురాటాకులా  వణికిస్తోందంటే . . ఇక మిగతా చిన్న చిన్న  దేశాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చైనాలోని వూహాన్ లో మొదలైన ఈ  కరోనా వైరస్ . .  క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే భారత్ లోని కేరళలో ఓ కేసు నమోదైంది. మరోవైపు త్రిపురకు చెందిన వ్యక్తి మలేషియాలో చనిపోయాడు. దీంతో కరోనా వైరస్ దెబ్బకు భారత్ సైతం గడగడలాడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ సహా అంతర్జాతీయంగా ఉన్న భారతీయుల రక్షణపై ఇండియా అప్రమత్తమైంది. వుహాన్ లోని భారతీయులను భారత్ కు రప్పించేందుకు చైనా విదేశాంగ శాఖతో భారత విదేశాంగ చర్చలు జరిపింది. అందులో భాగంగా ప్రత్యేక విమానాన్ని వుహాన్ పంపించారు. అక్కడి నుంచి 324 మంది భారతీయులను ఇవాళ ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి రప్పించారు. ఐతే వారికి కరోనా వైరస్ ఉందా లేదా అనే అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో వారందరినీ .. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా చావ్లాలోని ఐటీబీపీ ఆస్పత్రికి తరలించారు. విమానాశ్రయం నుంచి వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి తీసుకు వెళ్లారు. ఐతే వారి పరిస్థితి చాలా వరకు సాధారణంగానే ఉందని ఐటీబీపీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కానీ వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. పరీక్షలు పూర్తయిన తర్వాత వారందరినీ స్వస్థలాలకు పంపించే అవకాశం ఉంది. 


[[{"fid":"181584","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


మరోవైపు ఢిల్లీలో కరోనా వైరస్ చాప కింద నీరులా  వ్యాపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో మరో ఇద్దరు కరోనా వైరస్ అనుమానితులు రామ్ మనోహర్ లోహియా(ఆర్ఎంఎల్) ఆస్పత్రిలో చేరారు. దీంతో కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో 8కి చేరింది. గతంలో చేరిన ఆరుగురికి ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వారి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్ష కోసం పంపించారు. ఆయా నివేదికలు రావాల్సి ఉంది.