Glider Crash - Two Navy personnel died: కొచ్చి: భారత నావికదళానికి చెందిన ఓ శిక్ష‌ణ విమానం (Glider Crashed) కూలింది. ఈ ఘటనలో ఇద్ద‌రు నేవీ అధికారులు మరణించారు. ఈ దుర్ఘటన కేరళ రాష్ట్రం కొచ్చి ( Kochi) నావికాదళానికి సమీపంలో ఉన్న తొప్పంపాడి వంతెన సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది. రోజువారీ శిక్ష‌ణ‌లో భాగంగా ఆదివారం ఉద‌యం కూడా పవర్ గ్లైడర్ ( naval power glider ).. ఐఎన్ఎస్ గ‌రుడ నుంచి బ‌య‌లుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే ఉదయం 7గంటల సమయంలో కొచ్చిలోని నావెల్ బేస్ స‌మీపంలో ఉన్న తొప్పంపాడి వంతెన దగ్గర కుప్ప‌కూలింది. దీంతో.. అందులో ఉన్న నావికదళ అధికారులు లెఫ్టినెంట్ రాజీవ్ ఝా (39), పెట్టీ ఆఫీస‌ర్ సునీల్ కుమార్ (29) అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించారు.  Also read: Bihar Assembly Election 2020: మహాకూటమి రథసారధిగా తేజస్వి యాదవ్


ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై నౌకాద‌ళ ఉన్న‌తాధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే రాజీవ్ ఝా ఉత్త‌రాఖండ్‌కు చెందిన‌వారు కాగా.. ఆయ‌న‌కు భార్యా, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. సునీల్ కుమార్ స్వ‌స్థ‌లం బీహార్ కాగా.. ఆయ‌న‌కు ఇంకా వివాహం కాలేదు. యుక్త వయస్సులోనే అధికారులిద్దరూ మరణించడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఇదిలాఉంటే.. రెండురోజుల క్రితం క‌ర్ణాట‌క‌లోని క‌ర్వార్ ప్రాంతంలో శిక్ష‌ణ విమానం సముద్రంలో కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒక అధికారి మ‌ర‌ణించ‌గా.. మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌పడ్డారు. Also read: Harthras Case: హత్రాస్‌ కేసును సీబీఐకి అప్పగించిన సీఎం యోగి